ప్రజాశక్తి-అనంతపురం నాలుగేళ్ల వైసిపి పాలనలో అనంతపురంలో చేసిన అభివృద్ధి శూన్యమని జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు టిసి వరుణ్ విమర్శించారు. జనసేన అధ్యక్షులు పవన్‌కళ్యాణ్ ఆశయ సిద్ధాంతాలను వివరిస్తూ ఆదివారం నగరంలో జనసేన జయభేరి కార్యక్రమం నిర్వహించారు. ముందుగా నగరంలోని తాడిపత్రి బస్టాండ్ వద్ద ఉన్న చెన్నకేశవస్వామి ఆలయంలో టి.సి.వరుణ్ దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఇంటింటికీ వెళ్లి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైసిపి అధికారంలోకి వచ్చిన నాలుగేళ్లలో అనంతలో జరిగిన అభివృద్ధి శూన్యమన్నారు. కేంద్ర ప్రభుత్వ నిధులతో చేపట్టిన అభివృద్ధిని స్థానిక నాయకులు తమ ప్రభుత్వం చేసిన అభివృద్ధిగా చెప్పుకుంటున్నారన్నారు. వైసిపి నాయకులు ఎన్నికల సమయంలో అనంత అభివృద్ధికి ఇచ్చిన ఏ ఒక్క హామీని అమలు చేసిన పాపాన పోలేదన్నారు. ఇప్పటికే అర్హులైన వికలాంగులు వితంతువులు వద్ధులకు పార్టీల పక్షపాతంతో పింఛన్లు రద్దు చేయటాన్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. పార్టీలకు అతీతంగా అభివద్ధి జరగాలంటే అది జనసేనతో మాత్రమే సాధ్యమవుతుందన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యక్రమాల ప్రధాన కార్యదర్శి భవానీ రవికుమార్, నగర అధ్యక్షులు పొదిలి బాబురావు, రాప్తాడు ఇన్‌ఛార్జి పవన్‌కుమార్, తాడిపత్రి ఇన్‌ఛార్జి శ్రీకాంత్‌రెడ్డి, అనంతపురం జిల్లా లీగల్ సెల్ అధ్యక్షులు మురళీకృష్ణ, జిల్లా ఉపాధ్యక్షులు జయరామ్‌రెడ్డి, అంకే ఈశ్వరయ్య, జిల్లా ప్రధాన కార్యదర్శిలు పత్తి చంద్రశేఖర్, కుమ్మర నాగేంద్ర, కార్యదర్శులు సంజీవరాయుడు, రాపా ధనుంజరు, చొప్ప చంద్ర, కిరణ్‌కుమార్, గౌతమ్‌కుమార్, వీరమహిళలు జెక్కిరెడ్డి పద్మావతి, అనసూయ, మంజుల, డోనే సరిత, తదితరులు పాల్గొన్నారు.
ప్రజలకు ప్రభుత్వ వైఫల్యాలను వివరిస్తున్నజనసేన జయభేరి జిల్లా అధ్యక్షులు టిసి వరుణ్










