రాష్ట్ర క్షత్రియ కార్పొరేషన్ ఛైర్మన్ పాతపాటి వాసు
ప్రజాశక్తి - కాళ్ల
వైసిపి బలోపేతానికి కృషి చేస్తానని రాష్ట్ర క్షత్రియ కార్పొరేషన్ ఛైర్మన్ పాతపాటి వెంకట శ్రీనివాసరాజు (వాసు) అన్నారు. పాతపాటి సర్రాజు నివాసంలో క్షత్రియ ఫెడరేషన్ ప్రతినిధులు బుధవారం శ్రీనివాసరాజును కలిశారు. పాతపాటి సర్రాజు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. క్షత్రియ కార్పొరేషన్ ఛైర్మన్‌గా నియమితులైన పాతపాటి వెంకట శ్రీనివాసరాజును ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా పాతపాటి వాసు మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డికి తాను జీవితాంతం రుణపడి ఉంటానన్నారు. ఈ కార్యక్రమంలో సౌత్ ఇండియా ఫెడరేషన్ అధ్యక్షులు సిహెచ్.వెంకటపతిరాజు, భీమవరం క్షత్రియ సేవా సమితి అధ్యక్షులు గాదిరాజు సుబ్బరాజు, పాలకొల్లు క్షత్రియ సేవా సమితి అధ్యక్షులు బిహెచ్.విశ్వనాథరాజు, బిఎస్‌ఎన్‌ఎల్.రాజు, కాకినాడ, అమలాపురం, కైకలూరు క్షత్రియ సేవా సమితి అధ్యక్షులు పాల్గొన్నారు. అలాగే క్షత్రియ సేవా సమితి ప్రతినిధులంతా అల్లూరి సీతారామరాజు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.










