మాట్లాడుతున్న మాజీ మంత్రి పొంగూరు నారాయణ
వైసిపి అరాచకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి..
మాజీ మంత్రి పొంగూరు నారాయణ
ప్రజాశక్తి-నెల్లూరు సిటీ: రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాక్షస, అరాచక పాలన సాగిస్తూ హక్కులను పూర్తిగా హరిస్తూ పాలన సాగిస్తున్నాడని ఈ పాలన గురించిప్రజలకు వివరించి చైతన్యవంతులను చేయాలని మాజీ మంత్రి పొంగూరు నారాయణ పేర్కొన్నారు. నెల్లూరు గోమతి క్యాంపు కార్యాలయంలో 13,14,39,43 తదితర డివిజన్ల పార్టీ నాయకులతో సోమవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. 2024 ఎన్నికల్లో టిడిపి గెలుపును ఎవరు ఆపలేరన్నారు. పార్టీపై ప్రజల్లో అనూహ్య స్పందన వస్తుందని ప్రతి కార్యకర్త గెలుపే లక్ష్యంగా పనిచేయాలన్నారు. రాక్షస పాలన అందిస్తున్న జగన్ కి బుద్ధి చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. చంద్రబాబు త్వరలోనే నిజాయతీగా బయటకు రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ కు బాబు అవసరమని ప్రజలు భావిస్తున్నారన్నారు. బాబు తోనే రాష్ట్రం పురోగతి చెంది పారిశ్రామికంగానూ అభివద్ధి చెందుతుందన్న ధీమాతో ప్రజలు ఉన్నారన్నారు. రానున్న ఎన్నికల్లో వైసీపీకి తగిన బుద్ధి చెబుతారన్నారు. కార్యక్రమంలో టిడిపి పార్లమెంటు అధ్యక్షులు అబ్దుల్ అజీజ్, నియోజకవర్గ పరిశీలకులు షేక్ కరీముల్లా తదితరులు పాల్గొన్నారు.










