వైసీపీ ప్రభుత్వంలోనే మెరుగైన అభివృద్ధి: ఎమ్మెల్యే
ప్రజాశక్తి- పలమనేరు: వైసీపీ ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రజలకు మెరుగైన అభివద్ధి.. సంక్షేమ పథకాలు అందుతున్నాయని పలమనేరు ఎమ్మెల్యే వెంకటేగౌడ తెలిపారు. బుధవారం మున్సిపల్ పరిధిలోని 4 వార్డు వినాయక నగర్, ఎల్బీనగర్, బలరాం క్వార్టర్స్, రంగాపురం ప్రాంతాల్లో 'గడపగడపకు మన ప్రభుత్వం' కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రజలకు మెరుగైన సేవలు అందించాలన్న లక్ష్యంతో ప్రవేశపెట్టిన గ్రామ సచివాలయ వ్యవస్థ దేశానికే ఆదర్శంగా నిలిచిందన్నారు. ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించేందుకు వాలంటీర్లు తగు చర్యలు తీసుకోవాలన్నారు. ప్రజల నుంచి సచివాలయాలకు వచ్చే ప్రతి సమస్యను నిర్ణీత కాలంలో పరిష్కరించాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాల అమలును జీర్ణించుకోలేని ప్రతిపక్షాలు ప్రభుత్వంపై లేనిపోని ఆరోపణలు చేసి ప్రజలను మభ్య పెట్టేందుకు ప్రయత్నిస్తున్నాయని ఆరోపించారు. రాబోవు రోజుల్లో అభివద్ధి సంక్షేమ పథకాల అమలులో జిల్లాల్లో పలమనేరును నియోజకవర్గాన్ని ఆదర్శంగా నిలుపుతామని తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్ పర్సన్ పవిత్ర, మురళీకష్ణ, వైస్ ఛైర్మన్లు చాన్మకమల్ బాషా, కిరణ్ కుమార్, వైసీపీ రాష్ట్ర కార్యదర్శి మురళీకష్ణ, మాజీ వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్మన్ ప్రహల్లాద, పట్టణ కన్వీనర్ ఎస్ కె ఎస్ జాఫర్, సింగిల్ విండో ఛైర్మన్ రఘు, నాలుగో వార్డ్ కౌన్సిలర్ మహమ్మద్ నియాజ్, కౌన్సిలర్లు కో ఆప్షన్ మెంబర్లు, మున్సిపాలిటీ నాయకులు, కార్యకర్తలు, అన్ని శాఖల అధికారులు పాల్గొన్నారు.










