మాట్లాడుతున్న ఎంఎల్‌ఎ ప్రసన్నకుమార్‌రెడ్డి
వైసీపీ ప్రభుత్వంలోనే అభివద్ధి
ప్రజాశక్తి-కోవూరు :రాష్ట్రాభి వద్ధి సంక్షేమం ఒక వైసీపీ ప్రభుత్వంలోనే సాధ్యమని మాజీ మంత్రి కోవూరు ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి అన్నారు. కోవూరులో బుధవారం పలు అభి వద్ధి కార్యక్రమాలను ప్రారంభత్సవం చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడు తూ, జగన్ చేపడుతున్న అభివద్ధితోనే ఆకర్షితులై టీడీపీ నుంచి వైసీపీలో చేరుతున్నారన్నారు. నియోజకవర్గంలోని కొందరు టీడీపీ వీడి వైసీపీలో చేరారు. కోవూరులోని బాలికోన్నత ప్రభుత్వ పాఠశాలలో రూ.74లక్షలతో కొత్తగా నిర్మించిన ఆర్వో వాటర్ ప్లాంట్ మిషన్‌ను, అదే విదంగా అదనపు గదిని ప్రారంభించారు.కోవూరు సామాజిక ఆరోగ్య కేంద్రంలో రూ.10లక్షల వ్యయంతో బ్లడ్ బ్యాంకును రూ.1.50 లక్షల వ్యయంతో ఎన్డీఎస్‌ను ఆయన ప్రారంభించారు. కరోనా వచ్చిన తర్వాత ప్రభుత్వ ఆసుపత్రిలో ఊహించిన విధంగా ప్రయివేటు ఆసుపత్రికి దీటుగా అనేక వైద్య పరికరాలు అందజేసిన ఘనత తమ ప్రభుత్వానిదేనని అన్నారు. కార్యక్రమంలో దొడ్డం రెడ్డి నిరంజన్‌బాబురెడ్డి, నలుబోలు సుబ్బారెడ్డి, శివుని నరసింహారెడ్డి, రామిరెడ్డి మల్లికార్జునరెడ్డి, పచ్చిపాల రాధాకష్ణారెడ్డి, జెడ్‌పిటిసి శ్రీలత, ప్రధానోపాధ్యాయులు నరసింహమూర్తి, డాక్టర్లు విజేత, వెంకటాచలపతి గౌడ్ తదితరులు పాల్గొన్నారు.










