Dec 06,2022 22:44

మాజీ మంత్రి ఎన్‌.అమర్నాథరెడ్డి

వైసీపీ ప్రభుత్వంలో కనిపించని అభివృద్ధి
ప్రజాశక్తి-పెద్దపంజాణి:
రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం ఏర్పడి మూడేళ్లు దాటినా అభివద్ధి కనిపించలేదని.. రాష్ట్రంలో అస్తవ్యస్తమైన పాలన జగన్మోహన్‌రెడ్డి సాగిస్తున్నారని మాజీ మంత్రి ఎన్‌.అమర్నాథరెడ్డి అన్నారు. మంగళ వారం మండలంలోని శంకర్రాయల పేట పంచాయతీలో 'ఇదేమి ఖర్మ.. ఈ రాష్ట్రానికి' కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజా సమస్యలు చర్చించకుండా ప్రభుత్వంలో ఉన్న మంత్రు లంతా చంద్రబాబునాయుడును విమర్శించ డానికి క్యాబినెట్‌ కమిటీలు, అసెంబ్లీ సమా వేశాలు నిర్వహిస్తున్నారన్నారు. వైసీపీ నాయ కులు చెప్పుకోవడానికి రాష్ట్రంలో ఓ అభివద్ధి కార్యక్రమాన్ని చేపట్టారా..? మంత్రులు, వైకాపా నాయకులు దాడులకు పాల్పడుతూ ప్రజల నుంచి దోచుకుంటున్నారని.. రోడ్డు పైకి వచ్చి మాట్లాడితే అక్రమ కేసులు బనాయించి అరెస్టు చేస్తున్నారన్నారు. వైకాపా సానుభూతిపరులు సర్పంచులుగా గెలిచిన గ్రామాల్లో లైట్లు వేయలేని పరిస్థితి వచ్చిందని..ఈ ప్రభుత్వంలో ఎందుకీ ఖర్మ అని అంటున్నారని, రాష్ట్రానికి రాజధాని పేరు చెప్పుకోలేని పరిస్థితిలో రాష్ట్ర ప్రజలు ఉన్నారని వాపోయారు. ఒక రాజధాని నిర్మించలేని ముఖ్యమంత్రి మూడు రాజధానులు అంటూ ప్రాంతాల మధ్య విద్వేషాలు రెచ్చగొడుతున్నారని తెలిపారు. రాష్ట్రంలోని ఉద్యోగులకు ఒకటో తేదీకి జీతం ఇచ్చే పరిస్థితుల్లో ప్రభుత్వం లేదని, టీడీపీ ప్రభుత్వంలో వెనుకబడిన వర్గాలకు కార్పొరేషన్ల ద్వారా రుణాలు ఇచ్చి వారిని ఆర్థికంగా కషి చేశామన్నారు. రాష్ట్రంలో కొత్త పరిశ్రమలు రాకపోగా ఉన్న పరిశ్రమలు పక్క రాష్ట్రాలకు తరలిపోతున్నాయని తెలిపారు. రాష్ట్ర ప్రజలు ఎన్నికలు ఎప్పుడు వచ్చినా వైసీపీని సాగనంపేందుకు స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నారని.. త్వరలో వైసీపీ పాలనకు ప్రజలు చరమగీతం పాడుతారని తెలిపారు. కార్యక్రమంలో మండల టీడీపీ అధ్యక్షులు నందకుమార్‌, నాయకులు చలపతి, సుధాకర్‌ రెడ్డి, కష్ణారెడ్డి, ముబారక్‌ మండల తెలుగు యువత అధ్యక్షులు, మండల తెలుగు యువత అధ్యక్షులు మాజీ ఎంపీటీసీలు, సర్పంచులు, మండల నాయకులు కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. రామకుప్పం: మండల పరిధిలోని ఉనిసిగానిపల్లి గ్రామపంచాయతీలో మంగళవారం 'ఇదేమి ఖర్మ.. ఈరాష్ట్రానికి' కార్యక్రమాన్ని స్థానిక తెదేపా నేతలు నిర్వహించారు. ఈ సందర్భంగా పంచాయతీ పరిధిలోని ఇంటి ఇంటికి తిరిగి కరపత్రాల ద్వారా ప్రభుత్వం చేపడుతున్న ప్రజా వ్యతిరేక విధానాలను వివరించారు. యూనిట్‌ ఇన్‌ఛార్జి రామ్మూర్తి, కుప్పం తెలుగు యువత ప్రధాన కార్యదర్శి శంకర్‌ చలం, మాజీ సర్పంచ్‌ జై శంకర్‌, పంచాయతీ ముఖ్య నేతలు మానేష్‌, కష్ణారెడ్డి ,షణ్ముగం, సుభాష్‌, గోపి, మునియప్ప తదితరులు పాల్గొన్నారు.