Apr 17,2023 21:48

మాట్లాడుతున్న అనిల్‌కుమార్‌ గౌడ్‌

ప్రజాశక్తి-గుత్తి       అరాచకాలు, దౌర్జన్యాలకు పాల్పడుతున్న వైసిపి ప్రభుత్వాన్ని ప్రజలు సాగనంపాలని గుంతకల్లు తెలుగు యువత నాయకులు ఆర్‌.అనిల్‌ కుమార్‌ గౌడ్‌ పిలుపునిచ్చారు. మండలంలోని ధర్మాపురం, ఎంగన్నపల్లి గ్రామాల్లో సోమవారం సాయంత్రం టీడీపీ ఆధ్వర్యంలో ఇదేం కర్మ రాష్ట్రానికి అనే కార్యక్రమం నిర్వహించారు. తెలుగు యువత నాయకుడు ఆర్‌.అనిల్‌ కుమార్‌ గౌడ్‌, టిడిపి నాయకులు ఇంటింటికి వెళ్లి ప్రజా సమస్యలు అడిగి తెలుసుకున్నారు. వైసీపీ ప్రభుత్వం చేస్తోన్న అక్రమాలు, దౌర్జన్యాల గురించి ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా అనిల్‌కుమార్‌ గౌడ్‌ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌లో దుర్మార్గ పాలన కొనసాగుతుందన్నారు. గ్రామాల్లో కనీస సౌకర్యాలు లేవన్నారు. సామాన్యులు బతికేందుకు ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని జగన్‌కు రాష్ట్రాన్ని పాలించే హక్కు లేదన్నారు. ఏపీ రాష్ట్రానికి రాజధాని లేకుండా జగన్‌ పరిపాలన కొనసాగిస్తున్నారని అన్నారు. వచ్చే ఎన్నికల్లో ప్రజలు సైకిలు గుర్తుకు ఓటు వేస్తే టిడిపి అధికారంలోకి వస్తుందని చంద్రబాబు నాయుడు సీఎం అయి ప్రజల కష్టాలు తీరుస్తారన్నారు. ఈ కార్యక్రమంలో టిడిపి మండల కార్యదర్శి శ్రీకాంత్‌ చౌదరి, పట్టణ కన్వీనర్లు బర్దివలి, రవిశంకర్‌ గౌడ్‌, మాజీ ఎంపీపీ వీరభద్రయ్య, మాజీ మార్కెట్‌ యార్డ్‌ చైర్మన్‌ ఎం.శ్రీనివాస యాదవ్‌, సర్పంచి భరత్‌ కుమార్‌, ఎంపీటీసీలు నారాయణస్వామి, ధనుంజయ, మాజీ సర్పంచులు శ్రీనివాస్‌ చౌదరి, వెంకటరాముడు, కె.నాగేంద్ర, సుబ్బారెడ్డి, నాయకులు గోవిందు, కృష్ణారావు, మహమ్మద్‌ అలీ, గోవర్ధన్‌ గౌడ్‌, జి.సుంకన్న, సాంబశివయ్య యాదవ్‌, సుధాకర్‌ యాదవ్‌, లక్ష్మణరావు, రమేష్‌, కొత్తపేట సూరి, అగ్గిరాముడు తదితరులు పాల్గొన్నారు.