Aug 15,2023 23:16

వైసీపీ పాలనలో మహిళలకు రక్షణ లేదు
ప్రజాశక్తి-రామకుప్పం: వైసీపీ పాలనలో మహిళలకు రక్షణ లేదని తెలుగు మహిళ జిల్లా అధ్యక్షురాలు కార్జాల అరుణ తెలిపారు. మంగళవారం రామకుప్పం టీడీపీ కార్యాలయంలో ఆమె విలేకరుల సమావేశంలో మాట్లాడారు. మహిళల కంట కన్నీరు దూరం చేస్తూ దీపం పథకం ద్వారా ఉచితంగా గ్యాస్‌ కనెక్షన్లు ఇచ్చా రని, వైసీపీ అధికారంలోకి వచ్చాక గ్యాస్‌ సిలిండర్ల ధరలు రెట్టింపు చేశారన్నారు. అదేవిధంగా అమ్మ ఒడి ద్వారా ఎంతమంది పిల్లలున్నా రూ.15 వేల చొప్పున ఇస్తామన్న జగన్‌ అధికారంలోకి వచ్చాక ఒక్క విద్యా ర్థికి మాత్రమే పరిమితం చేశారన్నారు. చంద్రబాబు మహి ళలు ఎదుర్కొంటున్న బాధలను గుర్తించి టీడీపీ అధికా రంలోకి వచ్చాక ప్రతి కుటుంబానికి ఏడాదికి మూడు గ్యాస్‌ సిలిండర్లు ఉచితంగా ఇస్తారని తెలిపారు. కుటుంబంలో ఎంత మంది పిల్లలు చదువుతుంటే అంతమందికి రూ.15 వేలు చొప్పున ఆర్థికసాయం అందిస్తారన్నారు. అదేవిధంగా ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం సౌకర్యం కల్పిస్తారని తెలిపారు. రాష్ట్రంలో మహిళాభివృద్ధి జరగాలంటే తప్పక టీడీపీ అధికారం లోకి రావాల్సిన అవసరం ఉందని తెలిపారు. వైసీపీ పాలనలో మహిలాభివృద్ధికి చేసిందేమీ లేదన్నారు. మహిళల మాన, ప్రాణాలకు రక్షణ కరువైందని తెలి పారు. అన్ని వర్గాల ప్రజలు, మహిళలు సంతోషంగా గడపాలంటే ప్రతి ఒక్కరూ సైకిల్‌ గుర్తుకు ఓట్లు వేసి గెలిపించాలన్నారు. సమావేశంలో కుప్పం నియోజక వర్గ అధ్యక్షురాలు అనసూయమ్మ, మాజీ జిల్లా ఉపా ధ్యక్షురాలు, మాజీ ఎంపీటీసీ అలివేలు మంగమ్మ, జిల్లా ఉపాధ్యక్షురాలు సుగుణమ్మ, మండల మహిళా అధ్యక్షురాలు పద్మమ్మ, బి లోకమ్మ, భువనేశ్వరి, రాణమ్మ, స్థానిక మహిళా నేతలు పాల్గొన్నారు.