Jul 20,2022 22:25

వైఎస్సార్‌సీపీతోనే రాష్ట్రాభివృద్ధి : డిప్యూటీ సిఎం
ప్రజాశక్తి- వెదురుకుప్పం

రాష్ట్ర అభివృద్ధి కేవలం వైఎస్సార్‌సీపీతోనే సాధ్యమని ఉపముఖ్యమంత్రి కళత్తూరు నారాయణస్వామి అన్నారు. బుధవారం మండలంలోని మాంబేడు పంచాయతీ ధర్మచెరువు గ్రామంలో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమం స్థానిక సర్పంచ్‌ కవిత ఆధ్వర్యంలో జరిగింది. ఈ సందర్భంగా డిప్యూటి సిఎం మాట్లాడుతూ గ్రామంలో ప్రతి గడపకు వెళ్లి ప్రజలతో మమేకమై రాష్ట్రంలో జగన్నన ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధికి ప్రజలకు వివరించాలన్నారు. అలాగే ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన ప్రజలందరికీ చేరాలని, దీనికి సచివాలయ సిబ్బంది, గ్రామ వాలంటీర్లు సహకరించాలన్నారు. కార్యక్రమంలో జెడ్‌పిటిసి సభ్యులు సుకుమార్‌, రాష్ట్ర నాయకులు పద్మనాభరెడ్డి, మాజీ ఎంపిటిసి సభ్యులు బండి రోసిరెడ్డి పాల్గొన్నారు.