Mar 02,2022 21:33

డాక్టర్లను సన్మానిస్తున్న ఎంఎల్‌ఏ


ప్రజాశక్తి- మదనపల్లె అర్బన్‌:
స్థానిక జిల్లా ఆసుపత్రిలో బుధవారం పదోన్నతిపై పొరుగు జిల్లాలకు వెళుతున్న వైద్యులకు ఆసుపత్రి మెడికల్‌ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ ఆంజనేయులు ఆధ్వర్యంలో వీడ్కోలు సమావేశాన్ని ఏర్పాటు చేసి ఘనసన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఎమ్మెల్యే మాట్లాడుతూ డాక్టర్లు అంకితభావంతో పనిచేసి మదనపల్లి జిల్లా ఆస్పత్రికి పేరు ప్రఖ్యాతులు తీసుకువచ్చారని అన్నారు. కరోనా సమయంలో ప్రాణాలకు తెగించి రోగుల ప్రాణాలను కాపాడారని డాక్టర్‌ జ్ఞానేశ్వర్‌, శ్రీరాములు, మధుసూదనాచారి, రత్నాకర్‌ల సేవల తీరును కొనియాడారు. ఇదే స్ఫూర్తితో కొత్తగా విధులు నిర్వర్తించే చోట కూడా ఉద్యోగధర్మాన్ని కొనసాగించి వత్తికి సార్థకతతో పాటు పేరు ప్రఖ్యాతలు తీసుకురావాలని సూచించారు. కార్యక్రమంలో ఆర్‌ఎంఓ డాక్టర్‌ నరసింహ శాస్త్రి, డాక్టర్‌ రామ్మూర్తినాయక్‌, డాక్టర్‌ భాస్కర్‌రెడ్డి, మహిళా వైద్యులు ఉమా, అనురాధ సిబ్బంది పాల్గొన్నారు.