ప్రజాశక్తి - పెనుమంట్ర
వాటర్ ప్లాంట్ ద్వారా అతి తక్కువ ధరకు స్వచ్ఛమైన తాగునీరు అందించనున్నట్లు పెనుమంట్ర సర్పంచి తాడిపర్తి ప్రియాంక అన్నారు. గురువారం స్థానిక పంచాయతీ పరిధిలో ఉన్న వాటర్ ప్లాంట్‌ను పున్ణప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రియాంక మాట్లాడుతూ 2009లో అత్తిలి ఎంఎల్‌ఎగా చెరుకువాడ శ్రీరంగనాథరాజు పనిచేసిన సమయంలో గ్రామీణ నీటిపారుదుల సరఫరా, పారిశుధ్య విభాగంలో ప్రజలకు స్వచ్ఛమైన తాగునీరందించేందుకు వాటర్ ప్లాంటు అందుబాటులో ఉండేదని తెలిపారు. అనివార్య కారణాల వల్ల ప్లాంట్ మూత పడిందన్నారు. ప్లాంటును తిరిగి పునరుద్ధరించేందుకు బోర్డు సభ్యులు తీర్మానం చేసినట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో ఎంఎల్‌ఎ చెరుకువాడ శ్రీరంగనాథరాజు సహకారంతో ఉపసర్పంచి భూపతిరాజు వెంకట శ్రీనివాసరాజు సౌజన్యంతో వాటర్ ప్లాంట్ పునరుద్ధరించినట్లు తెలిపారు. ఈ ప్లాంట్ ద్వారా ప్రజలకు అతి తక్కువ ధరకు స్వచ్ఛమైన తాగునీటిని అందించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో వైసిపి గ్రామ అధ్యక్షులు తేతలి సుధీర్ రెడ్డి, ఎంపిటిసిలు, బోర్డు సభ్యులు, వైసిపి నాయకులు, అధికారుల సిబ్బంది పాల్గొన్నారు.










