
ప్రజాశక్తి - శ్రీకాకుళం అర్బన్: శ్రీకాకుళం నగరపాలక సంస్థ, మున్సిపాల్టీల్లో ఖాళీగా ఉన్న వార్డు వాలంటీర్లకు అర్హులైన నిరుద్యోగ యువతీ యువకుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు నగరపాలక సంస్థ కమిషనర్ చల్లా ఓబులేసు ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల 10 నుంచి 16వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. 18న మౌఖిక పరీక్షలు నిర్వహించి, ఎంపికైన వార్డు వాలంటీర్లను విధుల్లోకి తీసుకోనున్నట్లు తెలిపారు. దరఖాస్తుదారులు పదో తరగతి తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణులై ఉండాలని స్పష్టం చేశారు. వార్డు వాలంటీర్లుగా ఏ వార్డు పరిధిలో పనిచేయాలని ఆశిస్తారో వారు ఆ వార్డునకు చెందిన వారై ఉండాలని తెలిపారు. ఈ ఏడాది సెప్టెంబరు 30వ తేదీ నాటికి 18 నుంచి 35 ఏళ్ల లోపు వయసు కలిగి ఉండాలని పేర్కొన్నారు. నిబంధనల ప్రకారం రిజర్వేషన్లు వర్తిస్తాయని తెలిపారు. మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు వర్తిస్తాయని పేర్కొన్నారు. ప్రస్తుతం చదువుతున్న విద్యార్థులు దరఖాస్తు చేయరాదని తెలిపారు. దరఖాస్తు చేసే అభ్యర్థులు తమ ఆధార్ నంబరు, విద్యార్హత, కుల ధ్రువీకరణ పత్రాలు, పాస్‌పోర్టు సైజ్‌ఫొటోతో పాటు తదితర వాటిని ష్ట్ర్‌్‌జూర://స్త్రతీaవీఎaషaతీసఝషష్ట్రఱఙaశ్రీayaఎ.aజూ.స్త్రశీఙ.ఱఅ ద్వారా అప్‌లోడ్ చేయాలని వివరించారు.