నీవా నది పరివాహక ప్రజల్లో అలజడి..
వరదల సమయాల్లోనే హడావుడి ..
ప్రజాశక్తి- చిత్తూరుఅర్బన్:వర్షం వస్తే నీవానది పరివాహక ప్రాంతాల్లోని ప్రజలు బిక్కుబిక్కు మంటూ ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని గడపాల్సివస్తోంది. వరదల సమయంలో సహాయ చర్యలు ప్రత్నామ్నాయం చూపుతామటు హడావుడి చేసే ప్రజాప్రతినిధులు, అధికారులు నీవానది ఉధృతి తగ్గాకా అటువైపుగా చూడటం లేదని నీవానది పరిహక ప్రాంతంలోని రాజీవ్‌నగర్, వీరభద్రకాలనీ, కైలాసపురం, తేనబండ ప్రాంతాల్లోని ప్రజలు చినుకుపడితే చితికిపోతున్నారు.
ఇటీవల ఫిబ్రవరి, మార్చిలో కురిసిన భారీ వర్షాలకు నీవానది పొట్టేతింది. నీవానది ఉధృత్తికి లోతట్టు ప్రాంతాలైన రాజీవ్‌నగర్, వీరభద్రకాలని, కైలాసపురం, తేనబండ ప్రాంతాలు నీటి మునిగి 13వందల మంది నిరాశ్రయులైయ్యారు. వీరి కూరగాలయ మార్కెట్ వద్ద జైహింద్ స్కూల్, తేనబండ ప్రభుత్వ పాఠశాల, ధర్మరాజుల గుడిలో తాత్కాలిక ఆశ్రయం కల్పించి భోజన వసతి ఏర్పాటు చేశారు. నీవానది ఉదృతి తగ్గంత వరకు అంటే 10రోజులకు పైగా వరదల్లో సర్వం కొల్పొయిన బాధితులు ప్రభుత్వం ఏర్పాటు చేసిన భవనాల్లో ఉండాల్సి వచ్చింది. అప్పట్లో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, జిల్లా కలెక్టర్ హరినారాయణ్, నరగ కమిషనర్, మేయర్ అముదలతో పాటు ప్రజాప్రతినిధులు వైసిపి నాయకులు నీవానది ముంపు ప్రాంతాలను పరిశీలించి సహాయక చర్యలను వేగవంతం చేయడంతోపాటు నీవానది ముంపు ప్రజలను ఆదుకుంటామని ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తామంటూ హామీల మీద హామీలు గుప్పించారు.
నీవానది ఆక్రమణలపై ప్రత్యేక సర్వే నిర్వహించి మరో మారు ఇలాంటి ప్రమాదం చోటు చేసుకోకుండా చర్యలు తీసుకుంటామని హామీలిచ్చారు. అయితే నీవానది వరద ఉధృతి తగ్గి మూడు నెలలు గడస్తున్నా ఏ మాత్రం పట్టించుకోవడం లేదని నీవానది ముంపు ప్రాంతాల్లో నివశిస్తున్న ప్రజలు వాపోతున్నారు. ప్రజాప్రతినిధులు, నగర కమిషనర్, మేయర్ వరదల సమయంలో ఇచ్చిన హామీ మేరకు నీవానది సరిహద్దు గోడ నిర్మించడంతో పాటు నివాసయోగమైన ప్రాంతాల్లో ప్రత్యామ్నంగా ఇండ్ల స్థలాలు మంజురు చేసి ఇండ్లు నిర్మించి ఇవ్వాలని కోరుతున్నారు.
నీవానది ముంపు ప్రజలను ఆదుకోవాలి..
నీవానది సరిహద్దు పొడవునా అనేకమంది పేదలు చిన్నచిన్న ఇండ్లు నిర్మించుకొని కాపురముంటున్నారు. రిక్షాపుల్లర్స్, హాకర్స్, భవననిర్మాణ కార్మికులు, ఇంటి పనివారు పెద్దసంఖ్యలో ఉంటున్నారు. వర్షాం కురిసే సమయంలో ఎప్పుడు వరద వస్తుందో తట్టాబుట్టా సర్ధుకొని గట్టుకు చేరుకోవాల్సి వస్తుందో అనే భయం వీరిని వెంటాడుతోంది. వంద సంఖ్యలో ఉన్న వీరిని అందుకొనేందుకు నీవానది లోతు చేసి అంచుల్లో రక్షణ గోడ నిర్మించాలి. గతంలో వంద కోట్లు రూపాయలు కేటాయించి ఇరిగేషన్ శాఖ ద్వారా ప్రతిపాదనలు పంపారు. వెంటనే నగర పాలక సంస్థ కల్పించుకొని నీవానది వరద ముప్పుప్రాంత వాసులను ఆదుకొనేలా చర్యలు తీసుకోవాలి, రాజీవ్‌నగర్, కైలాసపురం, వీరభద్ర కాలనీల్లో బిడ్జ్రిదాటేలా వంతెనలు నిర్మించాలి.
- కాంజివరం సురేంద్రన్, సిపిఎం నగర కార్యదర్శి










