Oct 17,2023 21:38

ఫొటో : వాల్‌పోస్టర్‌ను ఆవిష్కరిస్తున్న నాయకులు

వాల్‌పోస్టర్‌ ఆవిష్కరణ
ప్రజాశక్తి-కావలి : నూరుబాషా ఆశయ సాధన కోసం 29వ తేదీ ఆదివారం గుంటూరులోని ఆంధ్ర ముస్లిం కాలేజీ ఆవరణంలో రాష్ట్ర నూరుబాషా సంఘం ఆధ్వర్యంలో సింహగర్జన సభ సందర్భంగా మంగళవారం వాల్‌పోస్టర్‌ను ఆవిష్కరించారు. సింహ గర్జన సభకు రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుండి నూరుబాషా ప్రతినిధులు, నూరుబాషా సోదర సోదరీమణులు అందరూ హాజరు అవుతున్నారని తెలిపారు. కావలి నియోజకవర్గ నూరుబాషా సోదర సోదరీమణులు పాల్గొని ఈ సభను జయప్రదం చేయడానికి కృషి చేయాలని కోరారు. ఈ సందర్బంగా నాయకులు మాట్లాడుతూ చట్టసభల్లో నూరుబాషాలకు అన్ని రాజకీయ పార్టీలు ఎం.ఎల్‌.ఎ, ఎంపి సీట్లు కేటాయించాలన్నారు.
మైనారిటీ పదవులలో వర్గీకరణ దామాషా ప్రకారం నూరుబాషాలకు పదవులు కేటాయించాలని కోరారు. చట్ట సభలలో ఏ పార్టీ ఐతే నూరుబాషాలకు అవకాశం ఇస్తుందో, ఆ పార్టీకి సంపూర్ణ మద్దతు ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు షేక్‌.సలీమ్‌, రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ ఖాదర్‌బాషా, రాష్ట్ర యూత్‌ నాయకులు మౌలాలి, జిల్లా యూత్‌ అధ్యక్షులు షేక్‌.మస్తాన్‌, జిల్లా మహిళా అధ్యక్షురాలు షకీరా, షరీఫ్‌, కావలి నూరుబాషా అధ్యక్షులు షేక్‌.ఖలీల్‌, ఆర్గనైజింగ్‌ సెక్రటరీ చాన్‌బాషా, షాన్‌వాజ్‌, జిలానీ, మస్తాన్‌, అల్లిసాహెబ్‌, రఫీ, మహుబూబ్‌ బాషా, కాలేమస్తాన్‌, అజారుద్దీన్‌, సభ్యులు పాల్గొన్నారు.