Oct 27,2022 22:09

వాలీబాల్‌ పోటీలు ప్రారంభం
క్రీడలు మానసిక ఉల్లాసానికి ఉపకరిస్తాయి : ఎమ్మెల్యే
ప్రజాశక్తి- సోమల:
విద్యార్థులు చదువుతోపాటు క్రీడలను కూడా నేర్చుకొని ఆడడం వలన మానసిక ఉల్లాసం కలుగుతుందని శరీర ఆరోగ్యం కూడా బాగుంటుందని తంబళ్లపల్లె శాసనసభ్యులు పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డి అన్నారు. మండల కేంద్రమైన సదుం జడ్పీ ఉన్నత పాఠశాలలో గురువారం నియోజకవర్గస్థాయి క్రీడాకారుల ఎంపిక కార్యక్రమాన్ని ఆయన లాంఛనంగా ప్రారంభించారు. అండర్‌ 14 అండర్‌ 17 బాల, బాలికల వాలీబాల్‌, కోకో, కబడ్డీ పోటీలలో ఎంపిక కార్యక్రమాన్ని నిర్వహించారు. నియోజకవర్గంలోని ఆరు మండలాల నుండి క్రీడాకారులు హాజరై పోటీలలో పాల్గొని పలువురు జిల్లాస్థాయి పోటీలకు ఎంపిక అయ్యారు. కార్యక్రమంలో ఎంఈఓ శ్రీరాములు ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఫజురుల్ల, వ్యాయామ ఉపాధ్యాయులు నారాయణరెడ్డి, మల్‌రెడ్డి, పలువురు ప్రజా ప్రతినిధులు క్రీడాకారులు పాల్గొన్నారు.