May 29,2023 21:00

ప్రజాశక్తి - ఉండి
హెల్మెట్‌ ధరించకుండా ద్విచక్ర వాహనదారులు అతివేగంతో ప్రయాణించి ప్రాణాలను పోగొట్టుకుని వారి కుటుంబాల్లో తీరని విషాదం నింపుతున్నారని, ప్రతి ఒక్కరూ విధిగా హెల్మెట్‌ ధరించాలని ఎస్‌ఐ గంగాధర్‌రావు తెలిపారు. ఉండి గోరింతోట చర్చి సమీపంలో సోమవారం హెల్మెట్‌పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్‌ఐ మాట్లాడుతూ ద్విచక్ర వాహనదారుల ప్రాణాలను కాపాడేందుకే ప్రభుత్వం హెల్మెట్‌పై అవగాహన సదస్సులు నిర్వహిస్తోందన్నారు. వాహనదారులు ఎన్నిసార్లు అవగాహన కార్యక్రమాలు నిర్వహించిన నిర్లక్ష్యం వహిస్తున్నారని, తప్పనిసరి పరిస్థితుల్లో జరిమానా విధించడంతోనైనా మారుతారని తాము భావిస్తున్నామని తెలిపారు. ఇప్పటికైనా ద్విచక్ర వాహనదారులు కచ్చితంగా హెల్మెట్‌ ధరించాలన్నారు. ఈ కార్యక్రమంలో పోలీసులు, సిబ్బంది, ద్విచక్ర వాహనదారులు పాల్గొన్నారు.