Mar 10,2023 21:36

పాలకోడేరు :ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా హెల్మెట్‌ ధరించాలని పాలకోడేరు ఎస్‌ఐ శ్రీనివాసరావు అన్నారు. గొల్లలకోడేరులో శుక్రవారం హెల్మెట్‌ డ్రైవ్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ద్విచక్ర వాహనాలను నిలుపుదల చేసి వానదారులతో హెల్మెట్లు కొనుగోలు చేయించి అవగాహన కల్పించారు. ద్విచక్ర వాహనంపై ప్రయాణం చేసేటప్పుడు హెల్మెట్‌ తప్పనిసరి అన్నారు. ప్రతి ఒక్కరూ హెల్మెట్‌ వినియోగించాలని, లేనిపక్షంలో చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ఎస్‌ఐ వెంట సిబ్బంది ఉన్నారు.