Mar 11,2023 20:51

జిల్లా ఎస్‌పి రవిప్రకాష్‌
ప్రజాశక్తి - వీరవాసరం
ద్విచక్ర వాహనదారులు తప్పని సరిగా హెల్మెట్‌ ధరించాలని ఎస్‌పి రవిప్రకాష్‌ అన్నారు. హెల్మెట్‌ ధారణపై ప్రత్యేక డ్రైవ్‌ను ఎస్‌పి రవిప్రకాష్‌ ఆధ్వర్యంలో శనివారం వీరవాసరంలో నిర్వహించారు. గతానికి భిన్నంగా జరుగుతున్న ఈ డ్రైవ్‌లో ఫైన్‌లకు స్వస్తి చెప్పి హెల్మ్‌ట్‌ లేని వాహనదారులచే అక్కడికక్కడే హెల్మెట్‌ కొనుగోలు చేయించి వారిచే ధరింపచేస్తున్నారు. ఈ డ్రైవ్‌లో హెల్మెట్‌ కొనుగోలు చేయించడంతో పాటు వారికి ఒక రోజా పువ్వుతో అభినందించి పింపించారు. ఈ డ్రైవ్‌లో సిఐ నాగప్రసాద్‌, ఎస్‌ఐ రమేష్‌ పాల్గొన్నారు.