Oct 21,2023 23:19

నిలదీస్తున్న సభ్యులు

ప్రజాశక్తి- టెక్కలి రూరల్‌: స్థానిక మేజర్‌ పంచాయతీ సర్వసభ్య సమావేశం శనివారం వాడివేడిగా జరిగింది. మేజర్‌ పంచాయతీ సర్వసభ్య సమావేశానికి 20 మంది సభ్యులు ఉండగా 10 మంది హాజరయ్యారు. పంచాయతీ సర్పంచ్‌ గొండెలి సుజాత అధ్యక్షుతన సమావేశం నిర్వహించారు. సర్పంచ్‌ సోదరులు పెత్తనంపై తీవ్ర స్థాయిలో విమర్శలు వెలువత్తాయి. అధికార వైసిపి వార్డు సభ్యులకు తెలియకుండా పనులు జరుగుతున్నాయిని వార్డు సభ్యులు తోట లోకేశ్వరరావు ఆవేదన వ్యక్తంచేశారు. వార్డు మెంబర్‌, మాజీ ఇఒ సువార్‌ రాజేశ్వరరావు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. కనీసం వార్డు మెంబర్లకు చెప్పకుండా పనులు చేయడం, పంచాయతీ నిధులు వినియోగం పట్ల తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. వార్డు మెంబర్లును కనీసం పట్టించుకోవడం లేదన్నారు. పంచాయతి నిధులు తీవ్ర స్థాయిలో దుర్వినియోగం అవుతున్నాయని, దీనిపై కమిటీలు వేయాలని సభ్యులు సూచించారు. వారంరోజుల్లో కమిటీ వేస్తామని ఇఒపిఆర్‌డి మల్లేశ్వరరావు తెలిపారు. సమావేశానికి హాజరుకాని వారిపై నోటిసులు ఇచ్చి చర్యలు తీసుకోవాలని సభ్యులు సూచించారు. సమావేశం వార్డుసభ్యులు కంచరాణ సావిత్రి, నూనెల సోమేశ్వరరావు, దివ్యల పోలయ్య, బమ్మిడి గురువునారడు, దాడి ధర్మారావు, అశోక్‌, అట్లా రవి, పీత రమణ పాల్గొన్నారు.