ప్రజాశక్తి-కందుకూరు :కందుకూరు జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో బుధవారం జిల్లా ఉత్తమ ఉపాధ్యాయునిగా ఎన్నికైన భౌతిక శాస్త్ర ఉపాధ్యాయులు విప్రనారాయణ బుధవారం ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమానికి అధ్యక్షులుగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎం నరసింహమూర్తి, ముఖ్య అతిథిగా మాజీ డిప్యూటీ ఈవో ఈవో ఎం రాంబాబు వ్యవహరించారు. పాఠశాలకు విప్రనారాయణ అందించిన సేవలను కొనియాడారు. పాఠశాలకు విరాళాలు ఇప్పించడంలో ప్రముఖ పాత్ర వహించడం జరిగినదని కొనియాడారు. డిప్యూటీవో మాట్లాడుతూ విప్రనారాయణ అనేక సైన్స్ కార్యక్రమంలో విద్యార్థుల చేత ప్రయోగాలు చేయించి వాటిని ప్రదర్శింప చేశారని జిల్లా స్థాయిలో బహుమతులు సాధించినట్లు తెలిపారు. స్టాఫ్ సెక్రటరీ పెరుగు ప్రసాదు, సీనియర్ ఉపాధ్యాయులు దామా లక్ష్మీనారాయణ, సందని భాష, మురళీకష,్ణ బాపయ్య ,ఏవిఆర్ మూర్తి, శేషగిరి ,మస్తానయ్య ఉన్నారు.










