ఉత్తమ ఉపాధ్యాయుడికి సన్మానం
ప్రజాశక్తి-సీతారామపురం : విద్యా బోధనలో ఉత్తమ సేవలు చేసినందుకు సెప్టెంబర్ 5వ తేదీన ఉపాధ్యాయుల దినోత్సవం సందర్భంగా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు అందుకున్న కొండూరు రవీంద్రను స్థానిక మండల విద్యా వనరుల కేంద్రంలో ఫ్యాప్టో తరఫున ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన ఎంఇఒ మస్తాన్ వలీ పాల్గొన్నారు. ఉత్తమ ఉపాధ్యాయుడు ఉపాధ్యాయ రంగంలో చేసిన సేవలకు గానూ ప్రభుత్వం గుర్తించి అవార్డు అందుకున్నందుకు ఆయనను అభినందించారు. అదేవిధంగా ఆయన ఇంకా జీవితంలో ఎన్నో ఉన్నత శిఖరాలు అధిరోహించి రాష్ట్రస్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు కూడా పొందాలని ఆశించారు. ఆయన చేస్తున్న సేవలను కొనియాడారు. కార్యక్రమంలో సీతారామపురం, ఓగూరు వాండ్ల పల్లి ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులు శ్రీనివాసులు, కొండయ్య, బెస్త కాలనీ ఎల్‌ఎఫ్‌ఎల్ హెచ్‌ఎం ఎడమ తిరుపతయ్య, యుటిఎఫ్ మండల అధ్యక్షులు భోగ్యం శ్రీనివాసులు, ప్రధాన కార్యదర్శి గొడ్లవేటి వెంకటేశ్వర్లు, సీనియర్ ఉపాధ్యాయ నాయకులు పాల్గొన్నారు.










