
పుష్పగుచ్ఛం అందజేస్తున్న ప్రిన్సిపాల్
* రీజినల్ జాయింట్ డెరైక్టర్ శోభారాణి
ప్రజాశక్తి - ఇచ్ఛాపురం: ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఉత్తమ ఫలితాలు సాధించేందుకు సమిష్టి కృషి చేయాలని రీజనల్ జాయింట్ డెరైక్టర్ ఎస్.శోభారాణి అన్నారు. స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలను బుధవారం సందర్శించారు. ఈ సందర్భంగా కళాశాలలో అధ్యాపకులతో సమీక్షా సమావేశం నిర్వహించి పలు సూచనలు చేశారు. సీడాప్ చైర్మన్ శ్యామ్‌ప్రసాద్ రెడ్డి కళాశాలలో నెలకొన్న పలు సమస్యలు ఆర్‌జెడి దృష్టికి తీసుకొచ్చారు. అనంతరం శ్యామ్‌ప్రసాద్ రెడ్డి విద్యార్థులతో ఇంటరాక్ట్ అయ్యారు. కార్యక్రమంలో కె.అరుణ పద్మ, కో ఆర్డినేటర్ కె.సుధ, డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ రోబిన్ కుమార పాడి, బారువ కళాశాల ప్రిన్సిపాల్ రామకృష్ణ, అధ్యాపకులు పాల్గొన్నారు.