అనంతపురం : రాబోయే కాలంలో ఉత్పత్తులు తయారీ రంగంకు భవిష్యత్తు ఉందని, ఇవి అభివద్ధి సాధిస్తాయని కె.హేమచంద్రారెడ్డి తెలిపారు. సోమవారం స్థానిక జెఎన్‌టియు వర్శిటీ అధ్యాపకులు, యూనివర్సిటీ డైరెక్టర్లతో విసి రంగజనార్ధన అధ్యక్షతన సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన హేమచంద్రా రెడ్డి మాట్లాడుతూ ప్రతి విద్యార్థీ మొదటి సంవత్సరం ఇంజినీరింగ్ నుంచే వారికి కెరీర్ గైడెన్స్‌పై అవగాహన కల్పించాలని సూచించారు. రాబోవు కాలంలో ఉత్పత్తి ఆధారతి పరిశ్రమలు దేశంలో మరింత అభివద్ధి చెందే అవకాశం ఉందని తెలిపారు. అధ్యాపకులు కూడా భోధనా పద్ధతుల్లో సరికొత్త విధానాలను అవలంభించుకోవాలన్నారు. యూనివర్సిటీల భోధన సిబ్బంది వారి ఆర్జిత సెలవులను నగదుగా మార్చుకోవడం, గత సర్వీస్‌ను ఉద్యోగోన్నతిలో పరిగణించడం కోసం జీవో నెం.20ను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిందన్నారు. ఈ కార్యక్రమంలో రెక్టార్ ఆచార్య ఎం.విజయకుమార్, రిజిస్ట్రార్ సి.శశిధర్, యూనివర్శిటి డైరెక్టర్లు, కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య ఎస్‌వి.సత్యనారాయణ, భోధన సిబ్బంది పాల్గొన్నారు.










