May 18,2023 12:52
  • వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు ప్రవీణ్ కుమార్

ప్రజాశక్తి-చిలమత్తూరు : ఉపాది కూలీలకు పెండింగ్ లో ఉన్న 6 వారాల బిల్లులు వెంటనే చెల్లించాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు ప్రవీణ్ కుమార్  అన్నారు. ఈ మేరకు గురువారం చిలమత్తూరు మండల పరిదిలోని చాగలేరు పంచాయతీలో ఉపాది పనులను పరిశీలించి కూలీల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కూలీలకు గత 6 వారాలకు సంబందించిన బిల్లులు పెండింగ్ లో ఉన్నాయని అన్నారు. అలాగే రోజు వారి కూలీ 275 రూపాయలు చెల్లించల్సి ఉండగా కనీసం 180 మాత్రమే చెల్లిస్తూ తీవ్ర అన్యాయం చేస్తున్నారని అన్నారు. అలాగే కూలీలకు పే స్లీప్ లు పంపిణీ చేయడం లేదని అన్నారు. వందరోజులు పూర్తీ చేసుకున్న కూలీలకు పనిముట్లు పంపిణీ చేయలేదని అన్నారు. ఎండలు తీవ్రంగా ఉన్నాయని ఉమ్మడి అనంతపురం జిల్లాలో అనేక చోట్ల కూలీలు వడదెబ్బకు గురవుతున్న సంగటనలు చూస్తున్నామని అయితే పని ప్రదేశాలలో మజ్జిగ, మంచినీరు, టెంట్లు కనిపించడం లేదని వెంటనే వాటిని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఇలాంటి  సమస్యలపై ఈ నెల 22వ తేదిన కలెక్టర్ కార్యాలయం వద్ద  పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం చేపట్టడం జరుగుతుందని ఈ కార్యక్రమంలో ఉపాది కూలీలు పెద్దఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.