- పంచాయతీలో ఫీల్డ్ అసిస్టెంట్ ని కూలీలు ఫుల్
ప్రజాశక్తి-బైరెడ్డిపల్లి : మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం లో పనిచేస్తున్న కూలీలకు క్షేత్రస్థాయిలో వసతులు నిల్. ఓఆర్ఎస్ ప్యాకెట్లు వైద్యం వంటి సౌకర్యాలు జాడే కాన రాలేదు. అయితే ఇక్కడ చాలా మంది ఉపాధి పనులే ఆధారంగా జీవనం సాగిస్తూ ఉన్నారు. మండలంలోని కంభం పల్లి పంచాయతీ పరిధిలోనీ దాస బండ్ల కొత్తచెరువు జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పనులు భాగంగా ప్రజాశక్తి వారిని పలకరించింది. వారి పని ప్రదేశంలో పడుతున్న ఇబ్బందులకు ప్రజాశక్తితో పంచుకున్నారు. వర్క్ ఐడి నెంబర్ 70589 భాగంగా ఆదివారం 34 మంది చేస్తున్నారు.
- భర్త వదిలేసాడు పనిచేయకపోతే పూట కలవదు : పిఆర్ జయమ్మ50సం.
30 సంవత్సరాల మునుపు జయరామిరెడ్డితో వివాహమైంది. నాకు పిల్లలు పుట్టలేదని ఇంట్లో నుంచి బహిష్కరించారు. అప్పటినుండి కూలి పనులకు వెళ్లి జీవనం సాగిస్తున్నాను. ఒంటరి మహిళ క్రింద నాకు ప్రభుత్వం వారు పింఛన్ కూడా ఇవ్వడం లేదు. దీనికి కారణంగా కూలీ చేయాల్సి వస్తుంది. ఉపాధి హామీ వేసవి కాలంలో పని చేసే అలియన్స్ పెంచి కూలీ ఇస్తే మా బతుకులకు కొంచెం తోడు అయినట్లు ఉంది.










