- ఉపాది పనులు తనిఖీ చేసిన ఎంపిడిఓ
ప్రజాశక్తి-పెద్దపంజాణీ: మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పనులను మండల పరిషత్ అభివృద్ధి అదికారి తూతిక శ్రీనివాస విశ్వనాథ్ ఆకస్మికంగా తనిఖీ చేసారు.మండలంలో వివిద గ్రామాలలో జరుగుతున్న ఉపాది పనులలో అవకతవకలు జరుగుతున్నాయని ఫిర్యాదులు రావడంతో ఎంపిడిఓ ఆకస్మిక తనఖీ చేపట్టారు. పెద్దారికుంటలో ఉపాది వేతనదారులు చెరువు పనులు చేయడాన్ని గమనించిన ఎంపిడిఓ పనులు జరిగే ప్రాంతంలో క్షేత్రస్థాయి పర్యవేక్షకులు,మేటు లేకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.పని జరుగు ప్రదేశాలలో త్రాగునీరు,ఫస్ట్ ఎయిడ్ బాక్స్ అందుబాటులో ఉంచుకోవలన్న తన ఆదేశాలను నిర్లక్ష్యం చేయడం కారణంగా ఏపిఓను,సాంకేతిక నిపుణులను హెచ్చరించారు.ఈ సంధర్భంగా క్షేత్రస్థాయి పర్యవేక్షకులకు, సాంకేతిక సహాయకుడికి ఆదేశాలు జారీ చేశారు.ఉపాది పనులలో, వేతనదారుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించ వద్దు అని ఎటువంటి అవకతవకలు జరగకుండా సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని,వేతన దారులకు నష్టం కలిగించే చర్యలను ఉపేక్షించనని ఎంపిడిఓ శ్రీనివాస విశ్వనాథ్ అన్నారు.










