Jun 19,2023 17:02
  •  కూలీల సంఖ్య పెంచాలని ఆదేశాలు

ప్రజాశక్తి-ఆత్మకూరు : గ్రామీణ ఉపాధి హామీ పథకం పనులపై ప్రత్యేక చొరవ చూపాలని, మండల ఎంపీడీవో విజయేంద్ర ప్రసాద్, మండల పరిషత్ అధ్యక్షురాలు సుబ్బర హేమలత, గ్రామీణ ఉపాధి హామీ సిబ్బందిని అధికారులను ఆదేశించారు.ఈ మేరకు సోమవారం మండల పరిధిలోని పడమటి యాలేరు, ఆత్మకూరు గ్రామాల్లో గ్రామీణ ఉపాధి హామీ పనులను ఆకస్మికంగా పర్యవేక్షించి, పలు సలహాలు సూచనలు ఉపాధి సిబ్బందికి తెలియజేశారు. అనంతరం పడమటి యాలేరు గ్రామంలోని  దళిత కాలనీలో ఉన్న స్మశాన వాటిక చుట్టూ  ప్రహరీ గోడ ఏర్పాటు చేయాలని ఎంపీపీ హేమలతకు,  వైస్ ఎంపీపీ నీలిమారెడ్డికి గ్రామ దళితులు, పెద్దలు  ఫిర్యాదు చేశారు. ఈ సమస్యపై అధికారులతో చర్చించి సమస్యను పరిష్కరిస్తామని ఎంపీపీ హేమలత, వైసీపీ నీలిమ  హామీ ఇచ్చారు. అదేవిధంగా గ్రామంలో చేపట్టిన పలు ప్రభుత్వ పనులను  కూడా అధికారులు పర్యవేక్షించారు. ఈ కార్యక్రమంలో  ఎంపీడీవో  విజయేంద్ర ప్రసాద్, ఏపీ ఓ,సుజాత, ఎంపీపీ వైస్ ఎంపీపీ తో పాటు,  నాయకులు  ఫణి రెడ్డి, దళిత కాలనీ  నాయకులు, నాగభూషణం, ఎర్రి స్వామి,నాగన్న తదితరులుపాల్గొన్నారు.