ప్రజాశక్తి-తాడేపల్లిగూడెం : ఉపాధి హామీ సమస్యలు పరిష్కరించాలని, ఉపాధి హామీలో కొలతలతో నిమిత్తం లేకుండా ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి నిర్ణయించిన రేటు 272 రూపాయలు ప్రతి ఉపాధి కూలికి ఇవ్వాలని రైతు, వ్యవసాయ కార్మిక సంఘాల నాయకులు చింతకాయల బాబురావు కండెల్లి సోమరాజు డిమాండ్ చేశారు. ఉపాధి పర్యటనలు భాగంగా బుధవారం ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు చింతకాయల బాబురావు, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు కండెల్లి సోమరాజు రామన్నగూడెం, పెద్ద తాడేపల్లి గ్రామాలలోని ఉపాధి పని ప్రదేశంలో పర్యటించి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. 6 గంటలకే ఆన్లైన్ మస్తరు విధానంతో చాలా ఇబ్బందులు పడుతున్నామన్నారు. సమ్మర్ అలవెన్స్, గుణపాలసానకు ఇచ్చే డబ్బులు ఇవ్వకుండా చేశారని ఉపాధి కూలీలు నాయకుల దగ్గర వాపోయారు. నాయకులు మాట్లాడుతూ రద్దు చేసిన అన్ని సమ్మర్ అలవెన్సలు వెంటనే పునరుద్ధరించాలని గుణపాల సానకు ఇచ్చే డబ్బులు, మంచినీళ్లకు ట్రావెలింగ్ అలవెన్సు ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. వేతనాలు కూడా 15 రోజులకు ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కంకిపాటి వీరాస్వామి, పోసిపో నవ్య, కాకర్లమూడి వెంకటరావు, గడ్డం రామచంద్రరావు, కోన పాముల ఏసు పాదం, కే వెంకటేశ్వరరావు, నూతంగి యేసురత్నం, పోతుల చిన్ని, బత్తిని శ్రీను, ఎర్ర రాజు తదితరులు పాల్గొన్నారు.










