Aug 19,2023 21:46

డిఇఒ కార్యాలయం ఎదుట ధర్నా చేస్తున్న ఫ్యాప్టో నాయకులు

         ప్రజాశక్తి- అనంతపురం కలెక్టరేట్‌   బదిలీలు, పదోన్నతులు పొందిన ఉపాధ్యాయులకు బకాయి ఉన్న రెండు నెలల వేతనాలు తక్షణమే చెల్లించాలని ఫ్యాప్టో జిల్లా ఛైర్మన్‌ ఎస్‌.సిరాజుద్ధీన్‌, సెక్రటరీ జనరల్‌ లింగమూర్తి, కో ఛైర్మన్‌ గోవిందరాజులు డిమాండ్‌ చేశారు. శనివారం ఫ్యాప్టో ఆధ్వర్యంలో నగరంలోని డిఇఒ కార్యాలయంలో ఎదుట నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర కమిటీ నిర్ణయం మేరకు నిరసన తెలిపినట్లు తెలిపారు. ఉపాధ్యాయులు బదిలీపై వెళ్లి అక్కడ పని చేస్తుంటే వేతనాలు ఇవ్వడంలో జాప్యం జరుగుతోందన్నారు. పదోన్నతలు పొందింన ఉపాధ్యాయులకు వేతనాలు అందని పరిస్థితి ఉందన్నారు. తక్షణమే వేతనాలు చెల్లించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఫ్యాప్టో కో ఛైర్మన్‌లు పురుషోత్తం, డిప్యూటీ సెక్రటరీ జనరల్స్‌ రమణారెడ్డి, శ్రీనివాసరెడ్డి, కార్యవర్గ సభ్యులు కోటేశ్వరప్ప, లింగమయ్య, సూర్యుడు, జార్జ్‌, రవీంద్ర, చంద్రశేఖర్‌, నాగేంద్ర, నాగరాజు, సతీష్‌,శ్యామ్‌ రవి, సర్దార్‌, రవి, హనుమంతు, కదిరప్ప, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.