Oct 15,2023 22:25

ఫొటో : ఉపాధ్యాయుడిని సన్మానిస్తున్న దృశ్యం

ఉపాధ్యాయుడికి జాతీయ పురస్కారం
ప్రజాశక్తి-ఆత్మకూరు అర్బన్‌ : ఆత్మకూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో తెలుగు పాఠశాల సహాయకులుగా పనిచేస్తున్న డాక్టర్‌ ఎం.ప్రసాద్‌ జాతీయ విశిష్ట సాహితీ పురస్కారాన్ని అందుకున్నారు. ఉషోదయ ఫౌండేషన్‌ (భాకరాపేట, తిరుపతి జిల్లా) వారు వివిధ రంగాల్లో విశిష్ట సేవలందిస్తున్నవారికి డాక్టర్‌ బోయి భీమన్న స్మారక జాతీయ పురస్కారాన్ని తిరుపతి జిల్లాలోని బాకరాపేట, అర్జున్‌ మహాల్‌లో ఆదివారం పురస్కారాలు అందజేశారు.
అందులో భాగంగా తెలుగు సాహిత్యం, కళా రంగాలలో డాక్టర్‌ ఎం.ప్రసాద్‌ చేస్తున్న విశిష్ట కృషికి గుర్తింపుగా డాక్టర్‌ ఎం.ప్రసాద్‌కు ఉషోదయ ఫౌండేషన్‌ వ్యవస్థాపక అధ్యక్షురాలు డాక్టర్‌ ధనాశి ఉషారాణి సాహితీ పురస్కారాన్ని అందజేశారు. ప్రతిభా పురస్కార గ్రహీత డాక్టర్‌ ఎం.ప్రసాద్‌ను పాఠశాల ప్రధానోపాధ్యాయులు, బోధన, బోధనేతర సిబ్బంది అభినందించారు.