Jul 30,2022 21:17

అమృత్‌ సరోవర్‌ పథకం కింద చేపట్టే పనులు శాశ్వతంగా ప్రజలకు ఉపయోగపడాలి
'ఉపాధి'తో పాటు నీటి నిల్వ సామర్థ్యం ఎక్కువగా ఉండాలి: కలెక్టర్‌
ప్రజాశక్తి- యాదమరి:
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉపాధిహామీ పథకం కింద శాశ్వతంగా ప్రజలకు ఉపయోగపడే పనులు చేయాలని భావించడం జరిగిందని ఇందులో భాగంగా అమత్‌ సరోవర్‌ పథకం కింద పనులు చేపట్టడం జరుగుతుందని కలెక్టర్‌ ఎం.హరినారాయణన్‌ అన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా యాదమరి మండలం బుడితిరెడ్డిపల్లి గ్రామపరిధిలో చేపట్టిన చెరువు పనులను జిల్లా కలెక్టర్‌ శనివారం పరిశీలించారు. ఇప్పటివరకు 70మంది పనిచేయడం ద్వారా సుమారు 1700 క్యూబిక్‌ మీటర్ల మట్టిపని చేయడం ద్వారా ఈ అమత్‌ సరోవర్‌ కార్యక్రమం కింద చెరువు నిర్మాణం చేయబడిందని కలెక్టర్‌కు వివరించారు. ఇటువంటి కార్యక్రమాలను ఈ కార్యక్రమం ద్వారా చేపట్టడం ద్వారా ప్రజలకు ఉపయోగపడుతుందని, చుట్టుపక్కల బోర్లలో నీటిమట్టం పెరుగుదలకు ఉపయోగపడుతుందని తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ ఇటువంటి కార్యక్రమాన్ని ఎంపిక చేసినందుకు యాదమరి మండల ఇంజనీరింగ్‌ కన్సల్టెంట్‌ రమ్య, గ్రామ సర్పంచ్‌ వాసుదేవరెడ్డిలను అభినందించారు. అదేవిధంగా శాశ్వతంగా ఉండేటట్లు కట్ట బలంగా ఉండేటట్టు మరింత పనిచేయాలని సప్లై ఛానల్‌ పనులు ఉన్న చేపట్టాలని కలెక్టర్‌ అన్నారు. ఇటువంటి కార్యక్రమాలు మరిన్ని చేపట్టి భూగర్భ జలాల అభివద్ధి చెందేలా చేయాలన్నారు. కార్యక్రమంలో డ్వామా పిడి చంద్రశేఖర్‌, ఎంపీడీవో హరినాథ్‌ రెడ్డి, ఇంచార్జ్‌ తహశీల్దార్‌ మహేష్‌ పాల్గొన్నారు.
గ్రామంలో విద్య నాణ్యతగా ఉండాలంటే విద్యార్థులకు ఆహారం మంచి వసతి ఉండేలా చూడాలని జిల్లా కలెక్టర్‌ అన్నారు. యాదమరి మండలంలోని మాదిరెడ్డిపల్లి మండల ప్రాథమిక ఉన్నత పాఠశాలను కలెక్టర్‌ తనిఖీ చేశారు. జిల్లా కలెక్టర్‌ మధ్యాహ్నం భోజన పథకంతో పాటు నాడు- నేడు కార్యక్రమంలో జరుగుతున్న పనులను పరిశీలించారు. ఆహారంకు సంబంధించి మెనూ ఉపాధ్యాయులను అడిగి ఆవిధంగా ఇస్తున్నారా లేదా అని పరిశీలించారు. అదేవిధంగా విద్యార్థులను కూడా అడిగి సరైన ఆహారం ఇస్తున్నారా లేదా వారిలో ఏదైనా పోషక లోపాలు ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా అదనపు క్లాస్‌ రూమ్‌తోపాటు మరుగుదొడ్ల నిర్మాణం జరుగుతోందని, నాడు-నేడు కార్యక్రమంలో రెండవ దశలో పలు పనులను చేపట్టనున్నట్లు ఇంజనీరింగ్‌ అసిస్టెంట్‌ తెలిపారు. పనులు నాణ్యతగా చేయించాలని పాఠశాల కోసం ఇంకా స్థలం ఉంటే చూడాలని విద్యార్థులకు కొంత ఇరుకుగా ఉందని పాఠశాలను పరిశీలించిన జిల్లా కలెక్టర్‌ అన్నారు. సంబంధితశాఖల వారు తగుచర్యలు తీసుకొని పాఠశాల చుట్టుపక్కల ఏదైనా స్థలం ఉంటే చూడాలన్నారు. ఈసందర్భంగా పనుల నాణ్యతను పరిశీలించారు.
పోషక విలువలు, రక్తహీనత గురించి పాఠశాలలలో, అంగన్వాడీ కేంద్రాలలో తరచుగా తనిఖీలు నిర్వహించాలని జిల్లా కలెక్టర్‌ ఎం.హరినారాయణన్‌ అన్నారు. శనివారం మధ్యాహ్నం జిల్లా కలెక్టర్‌ యాదమరి మండలంలోని 184.గొల్లపల్లి గ్రామ సచివాలయంలో తనిఖీ చేశారు. ఈసందర్భంగా వర్షాకాలం రానున్నదని గ్రామాల్లో పారిశుద్ధ్య పనులు నిరంతరం పర్యవేక్షించాలన్నారు. అదేవిధంగా కోవిడ్‌ వ్యాక్సిన్‌ ప్రికాషనరి డోస్‌ పూర్తిచేయాలని జిల్లా కలెక్టర్‌ అన్నారు. సచివాలయ సిబ్బంది బయోమెట్రిక్‌ హాజరుతో పాటు వాలంటీర్ల బయోమెట్రిక్‌ హాజరును జిల్లా కలెక్టర్‌ పరిశీలించి సంతప్తి వ్యక్తం చేశారు. వైద్య సిబ్బంది నిర్ణయించిన మేరకు గ్రామ సచివాలయపరిధిలోని ఆరు స్కూళ్లను ప్రతి 10రోజులకు ఒకసారి పరిశీలించాలని అదేవిధంగా ఉన్న అంగన్వాడి కేంద్రాలలో ఉన్న పిల్లల ఆరోగ్యపరిస్థితిని ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలని ఏదైనా వారికి పోషక లోపాలు కానీ రక్తహీనత కానీ ఉంటే వారిని వైద్యుల వద్దకు తీసుకెళ్లాలని ఆరోగ్యవంతంగా లేనివారి విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకొని వారిని ఆరోగ్యవంతులుగా తయారు చేయాల్సిన బాధ్యత ఐసిడిఎస్‌ మరియు వైద్య సిబ్బంది మీద ఉందని అన్నారు. అదేవిధంగా గ్రామంలో గహ నిర్మాణాలు, గ్రామ సచివాలయం మరియు రైతు భరోసా కేంద్రం నిర్మాణం పనులు వేగవంతంగా పూర్తి చేయించాలని సిబ్బందిని ఆదేశించారు.
రాష్ట్ర ప్రభుత్వం నవరత్నాలలో భాగంగా ఇల్లు లేని వారందరికీ ఇంటి సౌకర్యం కల్పించేందుకు భారీ ఎత్తున గహనిర్మాణ పథకం చేపట్టడం జరిగిందని ఈ కార్యక్రమంకు అర్హులైన వారందరూ ఈ సౌకర్యాన్ని ఉపయోగించుకొని గహ నిర్మాణాలు చేసుకోవాలని జిల్లా కలెక్టర్‌ ఎం. హరినారాయణన్‌ అన్నారు. శనివారం జిల్లా కలెక్టర్‌ యాదమరి మండలం పుల్లయ్యగారిపల్లిలో నిర్మిస్తున్న జగనన్న కాలనీని సందర్శించారు. 20మందికి కాలనీలో ఇంటి పట్టాలు ఇవ్వడం జరిగిందని ఒకరు మరణించగా మిగతా 19 మంది గహనిర్మాణాలు ప్రారంభించారని రెండుగహాలు పూర్తి కానున్నాయని తెలిపారు. ఈసందర్భంగా కాలనీలో విద్యుత్‌ సౌకర్యం, నీటి వసతి, రోడ్డు కల్పించడం జరిగిందని వేగవంతంగా గహనిర్మాణాలు చేపట్టి ఇంటి యజమానులుగా కావాలనిన్నారు. ఈ సందర్భంగా లబ్ధిదారులను వారికి ఇంతవరకు అందిన రుణం, సిమెంటు, బిల్లుల గురించి ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం గొప్ప ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగిందని ఈ కార్యక్రమాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని సకాలంలో గహనిర్మాణాలు పూర్తిచేసుకోవాలని జిల్లా కలెక్టర్‌ లబ్ధిదారులతో అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో హరినాథ్‌ రెడ్డి, ఇన్‌ఛార్జి తహశీల్దార్‌ మహేష్‌, గహనిర్మాణశాఖ అధికారులు పాల్గొన్నారు.