Sep 15,2023 21:47

ప్రజలతో మాట్లాడుతున్న ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి

           ప్రజాశక్తి-ఆత్మకూరు   2019 జనవరి 6న రామగిరిలో స్కిల్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్‌ను ప్రారంభించి 2లక్షల మందికి ఉద్యోగాలు కల్పించాలని మాజీమంత్రి పరిటాల సునీత తెలివి తక్కువ మాటలు మాట్లాడు తోందని ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి విమర్శించా రు. శుక్రవారం మండల కేంద్రంలో జగనన్న ఆరోగ్య సురక్ష పథకాన్ని ప్రారంభించారు. ముందుగా నూతనంగా మంజూరైన పింఛన్లను పంపిణీ చేశా రు. అనంతరం జిల్లా పరిషత్‌ ఛైర్‌పర్సన్‌ బోయ గిరిజమ్మతో కలిసి గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా ఇంటింటికీ వెళ్లి ప్రజల సమస్య లను అడిగి తెలుసుకోవడంతోపాటు సంక్షేమ పథకాలను వివరిస్తూ కరపత్రాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సరిగ్గా మూడు నెలల్లో అధికారం కోల్పోతామనగా ప్రారంభించిన స్కిల్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్‌ ద్వారా 2 లక్షల మంది యువతకు శిక్షణ ఇప్పించి ఉద్యోగాలు ఇప్పించామని చెప్పుకోవడం సిగ్గు చేటన్నారు. రాష్ట్రవ్యాప్తంగా కూడా ఇంతమందికి ఉద్యోగాలు ఇవ్వలేదన్నారు. పరిటాల సునీత తనకు చదువు రాకపోవడం వల్లే ఇలా మాట్లాడుతోందని ఎద్దేవా చేశారు. సిఎం జగన్‌ అధికారంలోకి వచ్చాక ప్రతి 50 ఇళ్లకు ఒక వాలంటీర్‌ను ఏర్పాటు చేయడంతోపాటు సచివాలయాన్ని ఏర్పాటు చేసి ఇళ్ల వద్దకే వెళ్లి సంక్షేమ పథకాలను అందజేస్తున్నామన్నారు.దీన్ని జీర్ణించుకోలేని ప్రతిపక్షాలు లేనిపోని విమర్శలు చేస్తున్నాయన్నా రు. యువతకు ఉపాధి కల్పిస్తామంటూ నమ్మబలికి రూ.371 కోట్ల అవినీతికి పాల్పడి నేడు చంద్రబా బు జైలుపాలయ్యారని విమర్శించారు. ఇకపోతే రాప్తాడు నియోజకవర్గంలో తాను అధికారంలోకి వచ్చాక ఇప్పటిదాకా 1700 దాకా ఉచితంగా బోర్లు వేయించినట్లు తెలిపారు. పేరూరు డ్యాంకు నీళ్లు తీసుకొచ్చామన్నారు. 20 వేల ఇళ్లను తీసుకొచ్చామన్నారు. ఎన్నో ఏళ్లు అధికారంలో ఉన్న సునీతమ్మ ఆత్మకూరు మండలానికి ఏం చేశారో చెప్పాలని డిమాండ్‌ చేశారు. పరిటాల సునీతమ్మ ఇప్పటికైనా వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలని హితవు పలికారు. ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్లు, ఎంపీపీలు, జడ్పీటీసీలు, వైస్‌ ఎంపీపీలు, ఎంపీటీసీలు, సర్పంచులు, చైర్మన్లు, డైరెక్టర్లు, మండల నాయకులు, కార్యకర్తలు, వాలంటీర్లు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.