Oct 03,2023 21:42

ఫొటో : పనులు పరిశీలిస్తున్న డ్వామా పిడి వెంకటరావు

'ఉపాధి' పనులు పరిశీలన
ప్రజాశక్తి-మర్రిపాడు : మండలంలోని నందవరంలో చెరువుకట్ట వద్ద జరుగుతున్న ఉపాధి హామీ పనులను డ్వామా పిడి వెంకటరావు మంగళవారం పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఉపాధి కూలీలు కొలతల ప్రకారం పనిచేస్తే రోజుకు రూ.272 వేతనం వస్తుందన్నారు. ప్రతిఒక్కరూ కొలతల ప్రకారం పని చేయాలని, అదేవిధంగా 100 రోజుల పనికి గానూ రూ.27,200 వేతనం పొందుతారని తెలిపారు.
తక్కవ కొలతలతో పని చేస్తే కూలీ రూపంలో నష్ట పోతారని, ఎండ తీవ్రత దృష్ట్యా ఉదయం 6 నుంచి 11 లోపు పనులను పూర్తి చేసుకోవాలని ఆయన సూచించారు. ఆయనవెంట ఇసి మల్లికార్జున్‌ రెడ్డి, టెక్నికల్‌ అసిస్టెంట్‌ డిరవీంద్ర, ఫీల్డ్‌ అసిస్టెంట్‌ షేక్‌ ఖాదర్‌బాషా, సర్పంచ్‌ తనయులు గాలిబోయిన రామ్మోహన్‌, ఉపాధి కూలీలు ఉన్నారు.