Mar 24,2023 21:00

ప్రజాశక్తి - పెనుగొండ
సిద్ధాంతం గ్రామంలో ఉపాధి హామీ పనులను వ్యవసాయ కార్మిక సంఘం మండల కార్యదర్శి షేక్‌ పాదుషా శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా కార్మికుల సమస్యలు అడిగి తెలుసుకుని మాట్లాడారు. కార్మికులకు టెంట్‌ లేదని, తాగునీరు, ఫస్ట్‌ ఎయిడ్‌ బాక్స్‌ వంటి ఏర్పాట్లు లేకుండా కార్మికులచే పని చేయిస్తున్నారని తెలిపారు. పట్టుమని పది రోజులు కూడా పనులు చెప్పడం లేదని విమర్శించారు. ఫీల్డ్‌ అసిస్టెంట్‌ లేకుండా ఒక సీనియర్‌ మేటు ఆధ్వర్యంలో పనులు నిర్వహించడం హాస్యాస్పదంగా ఉందన్నారు. తక్షణం కార్మికులకు బకాయి వేతనాలు చెల్లించాలని డిమాండ్‌ చేశారు. ఆయన వెంట సిఐటియు నాయకులు ఎస్‌.వెంకటేశ్వరరావు, కెవిపిఎస్‌ నాయకుడు కప్పల రత్నరాజు, ఉపాధి కూలీలు నక్కా లక్ష్మణరావు, పీతల నాగేశ్వరరావు ఉన్నారు.