Jul 11,2022 22:55

ఉపాధి పనులను పరిశీలించిన పిడి
ప్రజాశక్తి- యాదమరి

ఉపాధి హామీ పనులను జిల్లా ఉపాధి హామీ పదకసంచాలకులు చంద్రశేఖర్‌ ఆకస్మికంగా తనిఖీ చేశారు. సోమవారం మండల పరిధిలోని జంగాలపల్లి గ్రామపంచాయతీలో జరుగుతున్న సప్లై ఛానల్స్‌ పనులను పరిశీలించారు. కూలీలతో మాట్లాడుతూ వారి ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఉపాధి బిల్లులు సకాలంలో అందే విధంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. అనంతరం జంగాలపల్లి గ్రామ సచివాలయాన్ని తనిఖీ సచివాలయంలోని రికార్డులు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జాబ్‌ కార్డులు ఉన్న ప్రతి కుటుంబానికి పనులు కల్పించాలన్నారు. రైతులకు వారికి కావలసిన పనులు అంచనాలు తయారుచేసి ఉపాధి పనులు మంజూరు చేయాలన్నారు. గ్రామాల్లో కూలీలకు అవగాహన కల్పించి కూలీల సంఖ్య పెంచే విధంగా ఉపాధి సిబ్బంది క్షేత్రసిబ్బంది చర్యలు చేపట్టాలన్నారు. యాదమరి మండలానికి ఈనెల 22వేల పనిదినాలు టార్గెట్‌ను నిర్ణయిత సమయంలో పూర్తిచేయాలని సిబ్బందిని ఆదేశించారు. వీఆర్వో రాజారావు, ఈసీ రమ్య, టెక్నికల్‌ అసిస్టెంట్‌ మధు, మనోహర్‌, ఫీల్డ్‌ అసిస్టెంట్లు శరవణ, మనోహర్‌ పాల్గొన్నారు.