Jun 10,2022 23:05

సమావేశంలో మాట్లాడుతున్న ఉపాధి హామీ చట్టం డైరెక్టర్‌ పి.చిన్నతాతయ్య

చిత్తూరు అర్బన్‌ : ఉపాధి హామీ పథకం అమల్లో రాష్ట్రంలో జిల్లాను మొదటిస్థానంలో నిలపాలని మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం డైరెక్టర్‌ పి.చిన్నతాతయ్య అన్నారు. శుక్రవారం జిల్లా నీటి యాజమాన్య సంస్థ కార్యాలయంలోని సమావేశ మందిరంలో అదనపు పథక సంచాలకులు సివి శ్రీనివాస ప్రసాద్‌తో కలిసి సమీక్ష నిర్వహించారు. జిల్లాలో జూన్‌ మాసంలో 20.50 లక్షల పనిదినాలను లక్ష్యంగా నిర్ణయించామని, లక్ష్య సాధనకు ప్రతి అధికారీ సిబ్బందితో కలిసి సమన్వయంతో పనిచేసి లక్ష్యాలను సాధించాలన్నారు. లక్ష్య సాధనలో వెనకబడితే క్రమశిక్షణా చర్యలకు వెనుకాడబోమని హెచ్చరించారు. అలాగే అమృత్‌ సరోవర్‌ ప్రాజెక్టులో భాగంగా జిల్లాలో 72 చెరువులకు వెంటనే అంచనాలు తయారు చేసి పనులను ప్రారంబించాలన్నారు.