ప్రజాశక్తి-గార్లదిన్నె మండల పరిధిలోని బుదేడు గ్రామంలో చేపట్టిన ఉపాధి హామీ పనులతోపాటు పండ్ల తోటల పెంపకాన్ని ట్రైనీ కలెక్టర్ ప్రశాంత్‌కుమార్, అసిస్టెంట్ కలెక్టర్ ఆర్.కృష్ణానాయక్ శుక్రవారం పరిశీలించారు. ఇందులో భాగంగా పని దినాలు ఎన్ని.. రోజు కూలి ఎంత పడుతోందనే విషయాలను ఉపాధి కూలీలను అడిగి తెలుసుకున్నారు. తర్వాత పండ్ల తోటల పెంపకంతో రైతుల జీవన ప్రమాణాలను పెంపొందించుటకు ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను వివరించారు. అనంతరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ గౌతమితో ప్రజలకు అందిస్తున్న వైద్యసేవలు గురించి ఆరాతీశారు. అనంతరం సిరివరం గ్రామ సచివాలయాన్ని తనిఖీ చేసి శాఖల వారీగా ప్రజలకు అందిస్తున్న సేవలు గురించి అడిగి తెలుసుకున్నారు. అలాగే గ్రామంలో నిర్మాణంలో ఉన్న రైతు భరోసా కేంద్రం,హెల్త్ క్లినిక్ కేంద్రాలను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపిడిఒ విజయభాస్కర్, సీనియర్ అసిస్టెంట్ వెంకటరామిరెడ్డి, విఆర్‌ఒ సుధాకర్, రైతులు పాల్గొన్నారు.
ఉపాధి పనులను పరిశీలిస్తున్న ట్రైనీ కలెక్టర్ ప్రశాంత్‌కుమార్, అసిస్టెంట్ కలెక్టర్ ఆర్.కృష్ణానాయక్










