May 22,2023 21:54

విలేకరులతో మాట్లాడుతున్న సిపిఎం నాయకులు

         ప్రజాశక్తి-పుట్లూరు   ఉపాధి హామీ చట్టాన్ని కాపాడుకుందాం.. కదలి రండి.. అంటూ సిపిఎం నాయకులు పిలుపునిచ్చారు. సోమవారం మండల కేంద్రంలోని ఎంపిడిఒ కార్యాలయ ఆవరణలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు ఎస్‌.సూరి, సిపిఎం మండల కార్యదర్శి విటి.రామాంజినేయులు మాట్లాడుతూ రెండు పూటలా పని రద్దు చేయాలని, 40 శాతం సమ్మర్‌ అలవెన్సు ఇవ్వాలని, వంద రోజులు పూర్తి చేసిన కుటుంబానికి అదనంగా రాష్ట్ర ప్రభుత్వం పని చూపాలని, పని చేసే చోట టెంట్‌, నీళ్లు, మెడికల్‌ కిట్‌ ఇవ్వాలని, నీళ్లకు రూ.10, గునపం సానకు రూ.50, తట్టుకు 20 ఇవ్వాలని, ఆన్‌లైన్‌ మస్టర్‌ను రద్దు చేసి పాత పద్ధతిని కొనసాగించాలని, పే స్లీపులు ఇవ్వాలని, క్షేత్రస్థాయి మేట్లకు స్మార్ట్‌ఫోన్‌కు రూ.5 పారితోషికం ఇవ్వాలనే డిమాండ్‌ చేశారు. ఆయా సమస్యల పరిష్కారానికి ఎపి వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఈనెల 25న కలెక్టరేట్‌ ఎదుట నిర్వహించనున్న ధర్నాకు పెద్ద ఎత్తున ఉపాధి కూలీలు, మేట్లు రావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం మండల అధ్యక్షుడు టి.పెద్దయ్య, కార్యదర్శి బి.భాస్కర్‌రెడ్డి, నాయకులు జి.వెంకటచౌదరి, ఉపాధి కార్మికులు సురేందర్‌, నారాయణ, నాగసుబ్బరాయుడు, గంగాధర్‌, తదితరులు పాల్గొన్నారు.