May 13,2023 22:13

ప్రజాశక్తి - ఆచంట
             ఉపాధి హామీ చట్టం పేదల పాలిట వరమని సర్పంచి సుంకర సీతారామ్‌ అన్నారు. కొడమంచిలి చినపేటలో జరుగుతున్న ఉపాధి హామీ పనులను స్థానిక వార్డు మెంబర్‌ పుచ్చకాయల నాగార్జునతో కలిసి ఆయన శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా సర్పంచి సీతారామ్‌ మాట్లాడుతూ ఎండలు అధికంగా ఉన్నందున కూలీలు తగు జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. ఎక్కువ పని దినాలు మన గ్రామంలో నమోదైతే అత్యధిక నిధులు రావడానికి దోహద పడతాయన్నారు. గ్రామంలో ప్రతి కుటుంబం ఉపాధి హామీ పుస్తకం కలిగి ఉండాలని కోరారు. అమృత్‌ సరోవర్‌ పథకంలో భాగంగా చినపేట మంచినీటి చెరువును బాగు చేయడానికి ప్రతిపాదనలు సిద్ధం చేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధి హామీ ఫీల్డ్‌ అసిస్టెంట్‌ కోటే శశి మధు, కూలీలు పాల్గొన్నారు.