Jul 15,2022 22:57

సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌

చిత్తూరు అర్బన్‌: జిల్లాలో కొత్త పరిశ్రమల ఏర్పాటుతో ఉపాధి అవకాశాలు పెంపొందించేలా పరిశ్రమల క్లస్టర్‌ ఏర్పాటుకు చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్‌ యం. హరి నారాయణన్‌ సం బంధిత అధికారు లను ఆదేశించారు. శుక్రవారం సాయం త్రం జిల్లా సచివాల యంలోని సమావే శపు మందిరంలో జిల్లా పరిశ్రమల శాఖ జనరల్‌ మేనేజర్‌ చంద్రశేఖర్‌, జెడ్‌ ఎం ఏపీఐఐసీ సుధాకర్‌, ఇతర సంబంధిత అధికారులతో సమావేశం నిర్వ హించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లాలో కొత్త ఎంఎస్‌ఎంఈ పార్కుల ఏర్పాటుకు చర్యలు చేపట్టాలని సూచిం చారు.. జిల్లాలో పరిశ్రమల స్థాపనకు అవసరమైన వన రులు, ఇతర సదు పాయాలు పుష్క లంగా ఉన్నాయన్నారు. దీనితోపాటు జిల్లాలో పాడి పరి శ్రమ, గ్రానైట్‌, పవర్‌ లూమ్స్‌, మామిడి ఆధారిత పరిశ్రమలు పై ఎక్కువ మంది ఆధారపడి ఉండగా . కొత్తగా ఉపాధి అవ కాశాలను ఏర్పరిచేం దు కు గార్మెంట్స్‌, లెదర్‌ లాంటి క్లస్టర్ల ఏర్పా టుకు గల అవకాశా లను పరిశీలించాల న్నారు.. జిల్లాలో స్థానికంగా తయారు చేసే టెర్రకోట బొమ్మ లు తయారీ, క్రెట్స్‌ (ట్రేలు) ఉత్ప త్తులు సంబంధిత రంగాల కు చెందిన పరిశ్ర మల ఏర్పాటు కు మానవ వనరులు కూడా అందుబాటు లో ఉన్నాయని ఆ దిశగా చర్యలు చేపట్టాలన్నారు..నగిరి లో పవర్‌ లూమ్‌ పై ఎక్కువ మంది ఉపాధి ఏర్పరచుకొని జీవిస్తున్నారని ఇక్కడ అధునాతన సౌక ర్యాలతో కూడి న డైయింగ్‌ కామన్‌ ఫెసిలిటీ సెంటర్‌ ఏర్పాటు చేయాలని నగిరి టెక్స్టైల్స్‌ ఇం డిస్టీస్‌ ప్రతినిధులు ముత్తుస్వామి, రాజేంద్రన్‌, రవి కలెక్టర్‌ ను కోరారు..ఇన్లాండ్‌ కంటైనర్‌ డిపోను పల్ప్‌, గ్రానైట్‌ ఎక్స్‌ పోర్ట్‌ కోసం ఏర్పాటు చేయాలని జిల్లా మామిడి ప్రాసెసింగ్‌ అసోసియేషన్‌ ప్రెసి డెంట్‌ గోవర్ధన్‌ బాబీ కలెక్టర్‌ ను కోరారు. ఈ అంశాలపై పరిశీలిస్తామని జిల్లా కలెక్టర్‌ తెలిపారు.