ఉపముఖ్యమంత్రి కే. నారాయణస్వామిని శనివారం జరగనున్న సదస్సుకు ఆహ్వానం పలికి ఘనంగా సత్కరించారు.
ఉప ముఖ్యమంత్రికి ఆహ్వాన సత్కారం
తిరుపతి సిటీ : ఉపముఖ్యమంత్రి కే. నారాయణస్వామిని శనివారం జరగనున్న సదస్సుకు ఆహ్వానం పలికి ఘనంగా సత్కరించారు. శుక్రవారం సాయంత్రం ఐదు గంటలకు ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి ని దళిత నాయకులు కలిసి దుశ్శాలువతో సత్కరించి పూల గుచ్చాన్ని అందించారు. ఎస్వీ యూనివర్సిటీ లోని శ్రీనివాస ఆడిటోరియం నందు నిర్వహించబోయే దళితుల ఆత్మీయ సదస్సుకు ఆహ్వానించారు. దళిత నాయకులు, క్రిస్టియన్ జెఏసి చైర్మన్ ఎలమంచిలి ప్రవీణ్, ఎంవీఎస్ మనీ, మల్లారం మధు పాల్గొన్నారు.










