Oct 03,2023 20:44

మాట్లాడుతున్న మూలం రమేష్‌

ప్రజాశక్తి-ఉలవపాడు, కందుకూరు :జాతీయ రహదారికి దగ్గరగా ఉన్న ఉలవపాడు మండల కేంద్రం అభివద్ధిపై నేటికీ పాలకులు దష్టి సారించలేదని సిపిఎం జిల్లా కార్యదర్శి మూలం రమేష్‌, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మాదాల వెంకటేశ్వర్లు విమర్శించారు. నెల్లూరు జిల్లా సమగ్రాభివద్ధి సాధన కోరుతూ ఈనెల 2వ తేదీ నుంచి 13వ తేదీ వరకు జిల్లాలో జరుగుతున్న పాదయాత్ర మంగళవారం ఉదయం ఉలవపాడు మండలంలోని చాకిచర్ల, సుబ్బరాయుడు సత్రం, ఉలవపాడు, ఆత్మకూరు గ్రామాలలో పర్యటించింది. ఉలవపాడు చేరిన పాదయాత్రకు స్థానిక సిపిఎం నాయకులు, సిఐటియు అనుబంధ రంగాలైన ఆటో, అంగన్‌వాడీ, పంచాయతీ కార్మికులు పోలీస్‌ స్టేషన్‌ వద్ద స్వాగతం పలికారు. ఉలవపాడు మండల కేంద్రంలో ర్యాలీ జరిగింది. డాక్టర్‌ బి.ఆర్‌ అంబేద్కర్‌ విగ్రహానికి పూలమాలవేసి నివాళి అర్పించారు. సింగరాయకొండ బస్టాండ్‌లోని ఆటో స్టాండ్‌ వద్ద సభ జరిగింది. ఈ సభకు సిపిఎం ఉలవపాడు మండల కార్యదర్శి జివిబి కుమార్‌ అధ్యక్షత వహించారు. సభలో పాల్గొన్న పాదయాత్ర బందం నాయకులకు ఇండ్ల స్థలాలపై గిరిజనులు, తమను రెగ్యులర్‌ చేయించాలని అంగన్వాడీలు, తక్కువ వేతనాలతో వెట్టి చాకిరి చేస్తున్నారని పంచాయతీ కార్మికులు అర్జీలు ఇచ్చారు. అనంతరం బందం నాయకులు మూలం రమేష్‌, మాదాల వెంకటేశ్వర్లు పాదయాత్ర ఉద్దేశ్యాన్ని సభలో మాట్లాడారు. పాలకులు ఎవరున్నా జిల్లాను పారిశ్రామికంగా అభివద్ధి చేయడంలో నిర్లక్ష్యం ప్రదర్శి స్తున్నారని విమర్శించారు. సిపిఎం జిల్లా నాయకులు కత్తి శ్రీను వాసులు,జి.శేషయ్య,ఎస్‌. కె మస్తాన్‌ బి, పి పెంచలయ్య, సిఐటియు జిల్లా కార్యదర్శి ఎస్‌ కే రెహనా బేగం, సిపిఎం కందుకూరు నియోజకవర్గ నాయకులు జి వెంకటేశ్వర్లు, సిఐటియు ఉలవపాడు మండల అధ్యక్ష కార్యదర్శులు వాకా.లాతారెడ్డి, ఎస్‌. డి. గౌస్‌ బాషా, సిపిఎం మండల నాయకులు కొమరగిరి శేషమ్మ, కే వెంకటేశ్వర్లు, పొట్లూరు రవి, ఏలూరి నాగార్జున, దువ్వూరి జాన్‌, అంగన్వాడి యూనియన్‌ లీడర్‌ సిహెచ్‌ ఇందిరావతి, ఆటో వర్కర్స్‌ యూనియన్‌ మండల కార్యదర్శి డి కోటేశ్వరరావు,ఆటో నాయకులు ఎస్‌. కె. సుల్తాన్‌ ఉన్నారు.