ప్రజాశక్తి-అనంతపురం కలెక్టరేట్ జిల్లా గ్రంథాలయ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉచిత వేసవి శిక్షణ శిబిరంలో విద్యార్థులు ఎంతో ఉల్లాసంగా.. ఉత్సాహంగా గడిపారు. ఉమ్మడి అనంతపురం జిల్లాల్లో చేపట్టిన వేసవి శిక్షణ కార్యక్రమాలు గురవారం నాటిని నాలుగవ రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్‌పర్సన్ ఎల్‌ఎం.ఉమామోహన్‌రెడ్డి, కార్యదర్శి పి.రమ విద్యార్థులతో సరదాగా గడిపి పలు కార్యక్రమాలో ప్రోత్సహించారు. ఉదయం 8 నుంచి 9 గంటల వరకు సూర్య నమస్కారాలు, 9 నుంచి 10 గంటల వరకు కథలు చెప్పడం, 10 నిమిషాలు విరామం. 10:10 నుంచి 11 వరకు డాన్స్, 11 నుంచి 12 వరకు పుస్తక సమీక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉప గ్రంథాలయ అధికారిణి వి.సుబ్బరత్నమ్మ, గ్రంథాలయ సిబ్బంది, ఇంతియాజ్, కావేరి, హేమమ్మలిని, మల్లికార్జున, ఉజ్జినేశ్వరి, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.
వేసవి శిబిరంలో పాల్గొన్న జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్‌పర్సన్ ఎల్‌ఎం.ఉమామోహన్‌రెడ్డి, కార్యదర్శి పి.రమ










