'ఉజ్వల భారత్ - ఉజ్వల్ భవిష్యత్'
'బిజ్లీ మహోత్సవం'లో జడ్పీ చైర్మన్, ఎమ్మెల్యే
ప్రజాశక్తి- పలమనేరు , గంగవరం: గంగవరం మండలం, మేలుమాయిలోని మధర్‌థెరిస్సా ఇంజనీరింగ్ కాలేజ్ ఆడిటోరియంలో గురువారం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇందనశాఖ-దక్షిణ భారత్ విద్యుత్ మండలి చిత్తూరు జిల్లా వారి ఆధ్వర్యంలో నిర్వహించిన 'ఉజ్వల భారత్- ఉజ్వల భవిష్యత్' కార్యక్రమంలో జెడ్‌పి ఛైర్మన్ గోవిందప్ప శ్రీనివాసులు, ఎమ్మెల్యే వెంకటేగౌడ పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యుత్ రంగంలో ఆంధ్రప్రదేశ్ సాధించిన ప్రగతిని వివరించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా బిజ్లీ మహోత్సవ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారని అన్నారు. అజాదీ కా అమతోత్సవాల్లో భాగంగా ఏపీలోని 26 జిల్లాల్లో ఈకార్యక్రమాలను నిర్వహిస్తారని, జిల్లాలకు రెండు ప్రాంతాల్లో ఈకార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు అందులో భాగంగానే మనం ఈ కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహిస్తున్నామని అన్నారు. అజాదీ కా అమతోత్సవ్‌లో భాగంగా 75ఏళ్ల స్వాతంత్య్ర వేడుకలు దేశవ్యాప్తంగా జరుగుతున్న నేపథ్యంలో ఇంధన రంగంలో సాధించిన ప్రగతిని వివరించేందుకు దేశవ్యాప్తంగా బిజ్లీ మహౌత్సవాలను నిర్వహిస్తున్నారు. స్వాతంత్య్రం వచ్చే నాటికి దేశంలో విద్యుత్ పంపిణీ వ్యవస్థ అంతంతమాత్రంగానే ఉండేది అన్నారు.
75ఏళ్లలో మారుమూల ప్రాంతాలకు సైతం విద్యుత్ అందుతోంది. దేశంలో చీకట్లను తొలగించి ప్రగతి సాధించడంలో విద్యుత్ కీలకపాత్ర పోషించిందన్నారు. ప్రభుత్వ విద్యుత్ మంత్రిత్వశాఖ, భవిష్యత్తులో చేపట్టే దేశవ్యాప్తంగా దీంతోపాటు వన్ నేషన్ వన్ గ్రిడ్, వినియోగదారుల హక్కులు, విద్యుత్ రంగంలో అవసరమైన మార్పులను స్వాగతిస్తారని, 2047నాటికి సాధించాల్సిన విజయాలపై లక్ష్యాలను నిర్దేశిస్తారు వారు తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ ఉత్పత్తి -మిగులు విద్యుత్ అంశంలో చొరవ చూపుతూ.. ప్రణాళిక బద్ధంగా విద్యుత్ వినియోగం అంశంలో అడుగులు వేస్తున్నాయన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు జ్ఞానేందర్‌రెడ్డి, ఎంపిపిలు, జడ్పిటిసిలు, ఇతర ప్రజాప్రతినిధులు, విద్యుత్ శాఖ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.










