Nov 03,2022 21:49

ఉద్యోగులకు సిపిఎస్‌ అమలు చేయాలి
'జిపిఎస్‌ వద్దు- సిపిఎస్‌ ముద్దు' కరపత్రం విడుదల
ప్రజాశక్తి- పులిచెర్ల:
రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు పాత పెన్షన్‌ విధానమైన సిపిఎస్‌ను అమలు చేయాలని యుటిఎఫ్‌ జిల్లా అధ్యక్షులు వెంకటేశ్వరరావు అన్నారు. పులిచెర్లలో గురువారం జరిగిన యుటిఎఫ్‌ కార్యవర్గ సమావేశానికి రాష్ట్రఅధ్యక్షులు ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన గ్యారెంటీ పెన్షన్‌ స్కీం (జిపిఎస్‌) వలన ఉద్యోగులు నష్టపోతారని ఈవిధానాన్ని ప్రభుత్వం విరమించుకోవాలని అన్నారు. ఉపాధ్యాయుల బదిలీల జీవోను వెంటనే విడుదల చేయాలని, పదోన్నతులు వెంటనే కల్పించాలన్నారు. ప్రభుత్వం ఉపాధ్యాయ ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. అనంతరం జిపిఎస్‌ వద్దు- సిపిఎస్‌ ముద్దు కరపత్రాన్ని విడుదల చేశారు. సమావేశంలో యుటిఎఫ్‌ జిల్లా అధ్యక్షులు సుధాకర్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి జివి.రమణ, రాధాకష్ణ, పార్థసారధి, పులిచెర్ల మండల అధ్యక్షులు నానికా నాయక్‌, ప్రధాన కార్యదర్శి భానుప్రకాష్‌, జిల్లాకార్యదర్శి ఈశ్వర సురేంద్ర, కోశాధికారి మహమ్మద్‌ రఫీ, మండల గౌరవాధ్యక్షులు మధుసూదన్‌రెడ్డి, సభ్యులు దేవేందర్‌ రెడ్డి, కరుణాకర్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
బైరెడ్డిపల్లి: చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం పట్టభద్రుల నియోజకవర్గం సంబంధించి ఈనెల 7వ తేదీ లోగా ఓటరుగా నమోదు చేసుకోవాలని యుటిఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షులు వెంకటేశ్వర్లు పిలుపునిచ్చారు. ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారనిమిత్తం బైరెడ్డిపల్లికి విచ్చేసి పిడిఎఫ్‌ జెబివి, ఎస్‌టియు. వివిధ ప్రజాసంఘాలు బలపరచిన యూటీఎఫ్‌ అభ్యర్థి వెంకటేశ్వరరెడ్డిని ఎమ్మెల్సీ, పి.బాబురెడ్డిని టీచర్‌ ఎమ్మెల్సీగా ప్రథమ ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని అభ్యర్థించారు. కార్యక్రమంలో రాష్ట్ర యుటిఎఫ్‌ కార్యదర్శి రఘుపతిరెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి జీవీ రమణ. జిల్లా కార్యదర్శి రెడ్డెప్ప నాయుడు, మండల నాయకత్వం సిపి.ప్రకాశ్‌, సుబ్రహ్మణ్యం, నాగభూషణం, శరవణ, సిపిఎస్‌ రాష్ట్ర కోకన్వీనర్‌ సి.శివకుమార్‌, ఎస్‌టియు నాయకులు చైతన్యచారి, యువరాణి తదితరులు పాల్గొన్నారు.