Aug 23,2023 22:56

ఉద్యోగుల అర్జీలను స్వీకరిస్తున్న అధికారులు

       అనంతపురం కలెక్టరేట్‌ : ఉద్యోగులు వారి సమస్యల పరిష్కారం కోరుతూ ఉద్యోగుల గ్రీవెన్స్‌లో ఇచ్చే అర్జీలకు వెంటనే పరిష్కారం చూపించాలని ఇన్‌ఛార్జి డిఆర్‌ఒ, స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌ జి.శ్రీనివాసులు తెలిపారు. బుధవారం సాయంత్రం 3 గంటల నుంచి 5 గంటల వరకు అనంతపురం కలెక్టరేట్లోని రెవెన్యూ భవనంలో ఉద్యోగుల గ్రీవెన్స్‌ కార్యక్రమం నిర్వహించారు. వివిధ విభాగాలకు సంబంధించి 31 మంది అర్జీలను అందజేశారు. సంబంధిత శాఖల అధికారులు అర్జీలకు పరిష్కారం చూపేలా చర్యలు తీసుకోవాలని ఇన్‌ఛార్జి డిఆర్‌ఒ సూచించారు. ఈ కార్యక్రమంలో స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌ ఆనంద్‌, కలెక్టరేట్‌ ఏవో శ్రీధర్‌, ఐసిడిఎస్‌ పీడీ శ్రీదేవి, జిల్లా పరిశ్రమల కేంద్రం జనరల్‌ మేనేజర్‌ నాగరాజారావు తదితరులు పాల్గొన్నారు.