May 21,2023 21:40

కార్యక్రమంలో మాట్లాడుతున్న జెఎన్‌టియు ఉపకులపతి రంగజనార్ధన

       ప్రజాశక్తి-అనంతపురం   అనంతపురం జెఎన్‌టియు ఇంజినీరింగ్‌ కళాశాలలో చదివిన విద్యార్థులకు ఉద్యోగాలు కల్పించడంతో భేష్‌ అని ఎన్‌బిఎ కమిటీ సభ్యులు ప్రశంసించినట్లు ఉపకులపతి రంగజనార్ధన తెలిపారు. ఆదివారం జెఎన్‌టియులోని మెకానికల్‌ విభాగం సెమినార్‌ హాలులో ప్రిన్సిపల్‌ పి.సుజాత అధ్యక్షత బోధనా సిబ్బందితో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇంజినీరింగ్‌ కళాశాలలో ఎన్‌బిఎ పీర్‌ కమిటీ సభ్యులు మూడు రోజులపాటు పర్యటించి పలు విభాగాలను పరిశీలించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా కళాశాలలోని సివిల్‌, కెమికల్‌ విభాగాలతోపాటు కామన్‌ ఫెసిలిటీస్‌ను క్షుణ్ణంగా పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిపారు. ముఖ్యంగా విద్యార్థులకు ఉద్యోగాల కల్పనపై సంతృప్తి చెందారన్నారు. రాబోవు కాలంలో కళాశాల మరింత అభివృద్ధి చెందేందుకు ప్రతి ఉద్యోగి కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో రెక్టార్‌ ఎం.విజయకుమార్‌, రిజిస్ట్రార్‌ సి.శశిధర్‌, కళాశాల ప్రిన్సిపల్‌ పి.సుజాత, కలికిరి ప్రిన్సిపల్‌ ఎస్‌.వి.సత్యనారాయణ, వైస్‌ ప్రిన్సిపల్‌ ఆర్‌.భవాని, యూనివర్సిటీ డైరెక్టర్లు, అన్ని విభాగాల బోధన, బోధనేతర సిబ్బంది పాల్గొన్నారు.