Jun 01,2023 20:50

ప్రజాశక్తి - మొగల్తూరు
విఒఎల కాలపరిమితి సర్క్యూలర్‌ రద్దు చేసి ఉద్యోగ భద్రత కల్పించాలని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు తెలగంశెట్టి సత్యనారాయణ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. గురువారం సాయంత్రం మొగల్తూరులో తహశీల్దార్‌ కార్యాలయం వద్ద నిరసన ప్రదర్శన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. రూ.10 లక్షల గ్రూప్‌ ఇన్సూరెన్స్‌ సౌకర్యం కల్పించి, విఒఎల మెర్జ్‌ నిలుపుదల చేయాలని, అన్ని రకాల బకాయిలూ చెల్లించాలని, లోకో యాప్‌ వర్క్‌ కోసం 5జి మొబైల్‌ ప్రభుత్వమే అందించాలని కోరారు. విఒఎల మెర్జ్‌తో ఉపాధి కోల్పోయిన వారికి నష్ట పరిహారం ఇవ్వాలని, వయస్సు, చదువు, జెండర్‌ పేరుతో విఒఎల తొలగింపు ఆపాలని కోరారు. అనంతరం వినతిపత్రాన్ని తహశీల్దార్‌ అనిత కుమారికి అందజేశారు. కార్యక్రమంలో ఆర్‌.విజయ, వి.వరలక్ష్మి, వై.పద్మ, కె.రాజేశ్వరి, నిర్మలాదేవి పాల్గొన్నారు.