Aug 21,2023 00:19

ఉద్యమాలతోనే సమస్యల పరిష్కారం
యుటిఎఫ్‌ మధ్యంతర కౌన్సిల్‌లో మాజీ ఎమ్మెల్సీ విఠపు బాలసుబ్రమణ్యం
ప్రజాశక్తి- పలమనేరు
నేడు ఉద్యోగ ఉపాధ్యాయులు అనుభవిస్తున్న సర్వహక్కులు ఉద్యమాల ద్వారానే సాధించబడ్డాయని, పాలకుల దయా దాక్షిణ్యాల మీద ఆధారపడి హక్కులు రాలేదని యుటిఎఫ్‌ చిత్తూరు జిల్లా మధ్యంతర కౌన్సిల్‌ మాజీ ఎమ్మెల్సీ విఠపు బాలసుబ్రమణ్యం అన్నారు. ఆదివారం చిత్తూరు జిల్లా యుటిఎఫ్‌ మధ్యంతర కౌన్సిల్‌ సమావేశాలు పలమనేరులోని లయన్స్‌ క్లబ్‌ సమావేశ మందిరంలో యుటిఎఫ్‌ జిల్లా అధ్యక్షులు ఎం.సోమశేఖర్‌ నాయుడు అధ్యక్షతన జరిగాయి. ఈ సమావేశానికి ముఖ్యఅతిధిగా హాజరైన మాజీ ఎమ్మెల్సీ విఠపు బాలసుబ్రమణ్యం హాజరై మాట్లాడారు. గతంలో సాధించుకున్న హక్కులను పాలకవర్గాలు కాలరాస్తున్నాయని, ప్రజాస్వామిక హక్కులు లేకుండా చేస్తున్నాయని, వీటిని కాపాడుకోవడానికి నిరంతరం ఉద్యమాలు చేయాలని కోరారు. విద్యార్థుల తల్లిదండ్రులతో నిరంతరం సంబంధాలు కలిగి ఉండి ప్రభుత్వ విధ్యారంగాన్ని, తద్వారా ప్రభుత్వ పాఠశాలలు రక్షించుకోవాలని పిలుపునిచ్చారు. యుటిఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షులు నక్కా వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ఉపాధ్యాయ హక్కులను సాధించడానికి గడచిన 50 సంవత్సరాలుగా యుటిఎఫ్‌ నిరంతర కషి చేసిందని, ఉపాధ్యాయుల హక్కులు కాపాడడానికి ఎంతో మంది నాయకులు తమ జీవితాలను త్యాగం చేశారని తెలియజేశారు. నిర్బందాలు, ఒత్తిడులు ఎదురైనా, ప్రభుత్వ విద్యారంగాన్ని కాపాడటం కోసం ఉపాధ్యాయుల సంక్షేమాన్ని సాధించాడానికి నిరంతరం కషి చేస్తుందని తెలియజేశారు. ప్రశ్నించేతత్వాన్ని విద్యార్థులకు బోధించాలని, ప్రజాతంత్ర హక్కుల్ని నేర్పాలని కోరారు. 117 జీవోని రద్దు చేయకుండా ప్రభుత్వ విద్యారంగాన్ని కాపాడుకోలేమని 117 జీవోని రద్దు చేసే పోరాటంలో ఉపాధ్యాయులు పాల్గొనాలని కోరారు. యుటిఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి టి.రఘుపతిరెడ్డి మాట్లాడుతూ సిపిఎస్‌ను రద్దు చేసి, పాత పెన్షన్‌ విధానాన్ని పునరుద్దరించాలని ఉద్యోగ, ఉపాధ్యాయులు డిమాండ్‌ చేస్తుంటే ఆ డిమాండ్‌ని పక్కనపెట్టి మరొక కొత్తని విధానాన్ని తీసుకువచ్చిందని విమర్శించారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం పాతపెన్షన్‌ విధానాన్ని పునరుద్దరించకపోతే ఐక్య ఉద్యమాలు చేస్తామని హెచ్చరించారు. యుటిఎఫ్‌ జిల్లా ప్రధాన కార్యవర్మ జివి.రమణ కార్యదర్శి నివేదికను ప్రవేశపెట్టారు. జిల్లా కార్యదర్శులు యుటిఎఫ్‌ భవిష్యత్తులో చేసే పోరాటాల మీద కార్యక్రమాలపై చర్చించారు. కార్యక్రమంలో యుటిఎఫ్‌ జిల్లా గౌరవాధ్యక్షులు మునిరత్నం, రెహానా బేగం, కోశాధికారి ప్రసన్న కుమార్‌, రాష్ట్ర కౌన్సిలర్‌ సిపి.ప్రకాష్‌, జిల్లా కార్యదర్శులు కష్ణమూర్తి, ఏకాంబరం ఈశ్వర్‌ మహేంద్ర, మణిగండన్‌, రెడ్డెప్ప నాయుడు, జనవిజ్ఞాన వేదిక రాష్ట్ర ఉపాధ్యక్షులు యుగంధర్‌, ప్రజాసంఘాల నాయకులు గంగరాజు, ఓబుల రాజు, గిరిధర్‌ గుప్తా, భువనేశ్వరి, మల్లారపు నాగార్జున, సబ్‌ కమిటీ కన్వీనర్లు సరిత, రమణ, దీనావతి, స్థానిక డివిజన్‌ నాయకులు వేమ చంద్రారెడ్డి, శశికుమార్‌, పిసి బాబు, శివశంకర్‌, నిర్మల, గురునాధం, శ్రీనివాసులు, సుబ్రహ్మణ్యం, గురుమూర్తి శెట్టి, పాపయ్య, నాగభూషణం, పురుషోత్తం పాల్గొన్నారు.