Apr 21,2023 08:27

విలేకరులతో మాట్లాడుతున్న బలిజ సంఘం నాయకులు

         అనంతపురం : రాయలసీమ బలిజ మహా సంఘం ఆధ్వర్యంలో ఉచిత బలిజ కుల వివాహ పరిచయ వేదికను అనంతపురం శ్రీనివాసనగర్‌ బాలాజీ ప్రార్థన మందిరంలో ఈ నెల 30వ తేదీ నిర్వహిస్తున్నట్లు రాయలసీమ బలిజ మహా సంఘం అధ్యక్షుడు పామురాయి వెంకటేశ్వర్లు తెలిపారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ 30వ తేదీ ఆదివారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4-00 గంటల వరకు ఈ కార్యక్రమం కొనసాగుతుందని చెప్పారు. వధూవరులు 30-04-2023 తేదీ ముందుగా గానీ, ఆ రోజున గాని ఉదయం 8-00 గంటల నుంచి 12-00 గంటల వరకు వారి పేర్లను రిజిస్టర్‌ చేయించుకోవాలన్నారు. 12 గంటల నుంచి రెండు గంటల వరకు వధూవరుల పరిచయ కార్యక్రమం ఉంటుందన్నారు. అభ్యర్థులు తల్లిదండ్రులతో వారి బయోడేటా కార్డు సైజ్‌ ఫోటోతో హాజరు కావలన్నారు. ఎటువంటి కమీషన్లు లేకుండా ఉచిత మధ్యవర్తిత్వంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు చెప్పారు.